Summer Vegetables: ఎండకాతలంలో శరీరానికి నీరు చాలా అవసరం.  వేసవిలో శరీర చలవ కోసం అందరు ఎక్కువ నీరు ఉన్న ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతారు. కాబట్టి అందరు వేసవిలో నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకుంటారు.  తద్వారా శరీరంలో నీటి కొరతను పెంచుతాయి. ఎండకాలంలో అందరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. కావున దీని కోసం మంచి పోషకాలు కలిగిన కూరగాయలను తీసుకోవాలి. ఈ పోషకాలున్న ఆహారం తినడం వల్ల పొట్ట చల్లగా ఉండడంతో పాటు సీజనల్ వ్యాధులకు చెక్‌ పెట్టోచ్చు. అలాంటి కూరగాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దోసకాయతో ఎంతో మేలు:


ఎండకాలంలోదోసకాయలు మార్కెట్‌లో విచ్చల విడిగా దొరుకుతాయి. దోసకాయ వేడి శరీరం ఉన్న ప్రతి ఒక్కరు తినాలి. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. దీంతో పొట్ట చల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది. దోసకాయలో చాలా పోషక విలువలుంటాయి. ఇవి వేసవిలో వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దోసకాయలో కె & సి విటమిన్లు ఉండడంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.


శరీరానికి పొట్లకాయ కూడా మేలే:


కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో..పొట్లకాయ కూడా అంతే మేలు చేస్తుంది. ఏ సీజన్లోనైనా పొట్లకాయ తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వేసవిలో పొట్లకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధికంగా కాల్షియం ఉండడంతో ఎముకలను దృఢంగా ఉంచుతుంది.  పొట్లకాయ తీసుకోవడంతో కడుపులో సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ అదుపులో ఉంటాయని నిపుణులు తెలిపారు.



బీన్స్ తినడం వల్ల ప్రయోజనం:


అందరు వేసవి కాలంలో బీన్స్ కూడా తప్పకుండా తినాలి. బీన్స్‌ను ఉడకబెట్టి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనిని ఉడకబెట్టి తినడమే కాకుండా సలాడ్‌లో వేసుకుని కూడా తినవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడడమే కాకుండా..శరీరంలో ఫైబర్ స్థాయిని పెంచుతుంది.


Also Read: PK-KCR: కేసీఆర్‌తో పీకే వరుస సమావేశాలు, మరి కాంగ్రెస్‌లో చేరిక సంగతేంటి, అసలేం జరుగుతోంది


Also Read: Koratala siva-Jr Ntr: కొరటాల శివ సినిమాలో సూపర్ స్లిమ్‌గా కన్పించనున్న తారక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.