అల్లంని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? అయితే సందేహం ఎందుకు వాడి చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సుమారు ఒక ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు అంటున్నారు అల్లం మహత్యం తెలిసిన హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఇంతకి ఆ అద్భుతాలేంటో మీరే చూసేయండి మరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లంలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో మంటను వేగంగా నివారించుకోవచ్చు.


ఉదయం లేవగానే తరచుగా వికారంగా అనిపిస్తుందా? ప్రతీ రోజు అల్లం తినడం ద్వారా ఆ వికారం తగ్గుతుంది. నేరుగా అల్లం తినలేని వాళ్లు బెళ్లం, లేదా చక్కరతో చేసిన అల్లమురబ్బ ( Allamurabba )  తినడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కీమోథెరపీ చేయించుకునేవారు దీని నుండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.


Also read : COVID-19 vaccines for kids: చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్లు.. క్లారిటీ ఇచ్చిన గులేరియా


ప్రతీ రోజు అల్లం తీసుకోవడం ద్వారా కండరాల నొప్పిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. రోజూ అల్లం తీసుకోవడం వల్ల కండరాల నొప్పి (Muscle pain) క్రమంగా తగ్గుతుంది.


మలబద్దకంతో బాధపడే వారికి అల్లం మంచి దివ్య ఔషధంగా పని చేస్తుంది. అల్లంలో ఉండే పీచు (Fibre) మలబద్దకాన్ని దూరంచేస్తుంది.


అల్లం తినడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని (Periods pains) అరికట్టవచ్చు. అల్లం తీవ్రమైన కడుపు నొప్పి నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.


Also read : Health tips: వ్యాయమంతో Weight loss, fitness మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు


ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) తగ్గుతుంది. అల్లం తీసుకోవడం ద్వారా రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది.


అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకే జలుబు, వైరస్ (Flu, virus) బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది


గొంతు నొప్పితో (Throat pain) బాధపడే వారికి సైతం అల్లం ఛాయ దివ్య ఔషదంగా పనిచేసి వేగంగా ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లంతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of ginger) ఉన్నాయి కనుకే దీనిని వంటింటి ఔషదంగా చెబుతుంటారు.


Also read : Health benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook