Abortion Pills: ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే మహిళలు జాగ్రత్త..
Abortion Pills Side Effects: ప్రస్తుతకాలంలో మోడికల్ షాప్‌కు వెళ్లి అబార్షన్ పిల్స్‌తో స్వయంగా అబార్ష్ చేసుకుంటున్నారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఇవే ..
Abortion Pills Side Effects: నేటి కాలంలో చాలా మంది అబార్షన్ పిల్స్‌ను సులువు కొనుగోలు చేసుకొని అబార్షన్ చేసుకుంటున్నారు. కొన్ని దేశాల్లో నేరుగా అబార్షన్ చేసుకోవడం నేరంగా భావిస్తారు. అబార్షన్ చేసుకోవడానికి వైద్యులు సహాయంలేకుండా కేవలం టాబ్లెట్ల వంటివి ఉపయోగిస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల సమస్య నుంచి బయటపడిన శరీరానికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇష్టానుసారంగా మందులు వేసుకోవడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
టాబ్లెట్స్ వల్ల కలిగే దుష్ర్పభావాల:
దీని వల్ల మరింత ప్రమాదం సంభవిస్తుంది. మీరు కాకుండా వైద్యుడు అబార్షన్ చేస్తే.. పిండంలోని అన్ని భాగాలను తొలగించి ఎలాంటి హానీ కలగకుండా చూస్తాడు. కానీ ఫార్మసీల నుంచి నేరుగా మాత్రలు తెచ్చుకోవడం వల్ల ఇలాంటివి జరగడం లేదు. అయితే పిండం కణజాలం గర్భాశయం లోపలికి జోడించి ఉంటుంది. దీని వల్ల రక్తస్రావం, సంక్రమణకు కారణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ
సాధారణ దుష్ప్రభావాలు:
బొంటి నొప్పి, తిమ్మిరి:
గర్భాశయ కణజాలం తొలగించినప్పుడు ఈ సమస్యలు తలెత్తుతాయి. నొప్పి తీవ్రత వ్యక్తిగత వైవిధ్యాలను బట్టి ఉంటుంది.
రక్తస్రావం:
సాధారణ పీరియడ్స్ కంటే ఎక్కువ రక్తస్రావం కొన్ని రోజుల పాటు ఉండవచ్చు. రక్తస్రావంలో రక్తం గడ్డలు కూడా ఉండవచ్చు. మీరు ఉపయోగించే ప్యాడ్ ఒక గంట కంటే తక్కువ సమయంలో నాని ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
జీర్ణ సంబంధ సమస్యలు:
వికారం, వాంతులు ,అతిసారం వంటి జీర్ణ సంబంధ సమస్యల బారిన పడాల్సిన ఉంటుంది. ఈ సమస్యలు సాధారణంగా తాత్కాలిక అయినప్పటికీ ఎక్కువసేపు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
అలసట, మైకము:
హార్మోన్ల మార్పుల కారణంగా అలసట, మైకము కూడా కొందరని కలుగుతాయి. సాధారణంగా ఇవి తీవ్రంగా ఉండవు , ఎక్కువసేపు ఉండవు.
తలనొప్పి:
కొందరు మహిళలు గర్భధారణ నిరోధక మాత్రలు వాడినప్పుడు తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతారు.
ఈ దుష్ప్రభావాలు సాధారణంగా తాత్కాలికంగానే ఉంటాయి. కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. అయినప్పటికీ తీవ్రమైన దుష్ప్రభావాలు లేదా ఏదైనా ఆందోళనలు ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
తీవ్రమైన దుష్ప్రభావాల సంకేతాలు:
బలహీనత
తీవ్రమైన లేదా నిరంతర నొప్పి
అసాధారణమైన రక్తస్రావం
జ్వరం
చలి
ఈ లక్షణాలు కానీ మీ కనిపిస్తే మీరు వెంటనే వైద్యులను కలవండి. లేకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వైద్యుల సహాల లేకుండా సొంతం వైద్యం చేసుకోకండి. మీ నిర్ణయం మీ ప్రాణానికి ప్రమాదారకరం కావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి