Thyroid: ఈ చిట్కాలు పాటించి చూడండి..థైరాయిడ్ మాయమవుతుంది
Thyroid: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో ఒకటి థైరాయిడ్. ఎంత ప్రమాదకరమైనా..కొన్ని టిప్స్‌తో థైరాయిడ్ నియంత్రించుకోవడం సులభమే. ఆ చిట్కాలేంటో చూద్దాం
Thyroid: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో ఒకటి థైరాయిడ్. ఎంత ప్రమాదకరమైనా..కొన్ని టిప్స్‌తో థైరాయిడ్ నియంత్రించుకోవడం సులభమే. ఆ చిట్కాలేంటో చూద్దాం
ఆధునిక జీవనశైలి, క్రమ పద్దతిగా లేని ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ సమస్యగా ప్రధానంగా కన్పిస్తోంది. అయితే కొన్ని రకాల చిట్కాలతో థైరాయిడ్ నియంత్రణలో ఉంచవచ్చు. ఆ చిట్కాలు కూడా సులభమైనవే. థైరాయిడ్ ఉంటే మనిషి బరువు పెరుగుతాడు. కొంతమందికి మందులతో నయమవుతుంది. మరి కొందరు ఆహారపు అలవాట్లతో నియంత్రించుకుంటారు. ఆ పద్ధతులు, టిప్స్ ఏంటో పరిశీలిద్దాం..
కొంతమంది చాలా వేగంగా భోజనం చేస్తారు. ఇది ఆరోగ్యరీత్యా ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. థైరాయిడ్‌కు ఇది మంచిది కాదు. క్రమం తప్పకుండా యోగాసనాలు వేయడం ద్వారా థైరాయిడ్ తగ్గించవచ్చు. అందుకే ఇప్పటి నుంచి యోగాను మీ జీవితంలో భాగంగా చేసుకోండి.
సగం కంటే ఎక్కువ రోగాలు పచ్చని కూరగాయలు ఎక్కువగా తినడం ద్వారా తగ్గిపోతాయని న్యూట్రిషన్లు, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు పచ్చని కూరగాయలు తినకపోతే..ఇప్పట్నించే ఆ అలవాటు చేసుకోండి. మీ డైట్‌లో వాటిని భాగంగా చేసుకోండి. కూరగాయల వల్ల కలిగే ప్రయోజనాలు అమితం. థైరాయిడ్ నియంత్రణలో ఇవి బాగా ఉపయోగపడుతాయి.
Also read: Mango-Weight Loss: మామిడి పండుతో సునాయాసంగా బరువు తగ్గొచ్చు.. ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా?
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook