Thyroid Diet: ఆధునిక బిజీ ప్రపంచంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి మన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె వ్యాధులు సంభవిస్తుంటాయి. ఈ అన్నింటితో పాటు మరో ప్రమాదకర వ్యాది థైరాయిడ్. థైరాయిడ్ అనేది గొంతులో ఉండే చిన్న గ్రంథి. ఇందులో సమస్య ఏర్పడితేనే థైరాయిడ్ సమస్య అంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధైరాయిడ్ సమస్యకు పూర్తిగా చికిత్స లేదు. ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో థైరాయిడ్ అదుపు చేయవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్ధాలతో థైరాయిడ్ కండీషన్ మరింత వికటించవచ్చు. అందుకే థైరాయిడ్ రోగులకు డైట్ కంట్రోల్ చాలా అవసరం. ఏవి తినవచ్చు, ఏవి తినకూడదనేది తెలుసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి నుంచే శరీరానికి అవసరమైన హార్మోన్లు విడుదలవుతుంటాయి. అవసరానికి మించి లేదా తక్కువ హార్మోన్లు విడుదలవుతుంటే థైరాయిడ్ సమస్య ఉందని పరిగణిస్తారు. మందులతో థైరాయిడ్ సమస్యకు చికిత్స అందుబాటులో ఉన్నా...డైట్ కంట్రోల్ కూడా తప్పనిసరి. 


గోయిట్రోజన్ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఎందుకంటే ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో ఆటంకం కల్గిస్తాయి. పిట్యూటరీ గ్రంధిని ధైరాయిడ్ ఉత్ప్రేరక హార్మోన్ విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది. దాంతో థైరాయిడ్ సమస్య మరింతగా పెరుగుతుంది. అసలు ఈ గోయిట్రోజన్ ఫుడ్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ రోగులు వేరుశెనగకు దూరంగా ఉండాలి. దీనివల్ల హైపోధైరాయిడిజమ్ స్థితి వికటించవచ్చు. 


ఇక రాగులు కూడా నియమిత పద్ధతిలో వండిన తరువాత తినాలి. వాస్తవానికి రాగుల్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ గోయిట్రోజనిక్ ఫుడ్ కారణంగా థైరాయిడ్ రోగులకు అంత మంచిది కాదు. అయితే బాగా నానబెట్టి పూర్తి స్థాయిలో వండిన తరువాత  తినవచ్చు. అది కూడా నెలలో 2-3 సార్లు మాత్రమే.


డ్రై ఫ్రూట్స్‌లో అద్భుతమైంది బాదం. ఇందులో సెలేనియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఈ రెండూ థైరాయిడ్ ఫంక్షనింగ్‌కు మంచివే కానీ గోయిట్రోజనిక్ ఫుడ్ అయినందున ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. దీనివల్ల థైరాయిడ్ గ్రంధికి ఉండే అయోడన్ అవశోషన సామర్ధ్యం తగ్గిపోతుంది. అందుకే హైపోథైరాయిడిజమ్ రోగులు రోజుకు 3-5 బాదం గింజలను నానబెట్టి తినాలి.


ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజమ్ రోగులు గోధుమల వినియోగాన్ని తగ్గించమని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే గ్లూటెన్ రహిత ఆహారం తీనేవారి రక్తంలో యాంటీ బాడీస్ సాంద్రత తగ్గుతుంది. ఫలితంగా థైరాయిడ్ గ్రంథిపై దాడి చేయవచ్చు. ఇక మరో ముఖ్యమైన తినకూడదని ఆహారం సోయా బీన్స్. సోయా బీన్స్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంధిలో మంట సమస్య తలెత్తవచ్చు. 


Also read: Cholesterol: ఈ 5 కూరగాయలు కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి.. ఈరోజే మీ డైట్లో చేర్చుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook