Thyroid: థైరాయిడ్ ఉన్నవారు ఈ 3 ఆహారాలు అస్సలు ముట్టుకోవద్దు.!
Thyroid Problem: థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు పలు రకాల ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం వారికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Thyroid Problem: ప్రస్తుతం చాలా మందిలో థైరాయిడ్ సమస్య చాలా వేగంగా పెరుగుతున్నాయి. థైరాయిడ్ హార్మోన్ పెరుగుదల కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మందిలో శరీర బరువుతో పాటు, రక్త హీనత ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇంకొందరిలో అతిసారం మొదలైన సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలకు తరచుగా లోనయ్యే వారు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల రసాలను కూడా తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఆహారాలను మానుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి:
టీ-కాఫీ మానుకోండి:
థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు టీ-కాఫీలు తరచుగా తాగడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కెఫిన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి థైరాయిడ్ పరిమాణాలను పెంచే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు ఎక్కువగా సోడా, చాక్లెట్లను కూడా తీసుకోకపోవడం చాలా మంచిది.
గ్లూటెన్ రహిత పిండి:
థైరాయిడ్ కారణంగా కొందరికి శరీరంలో వాపు వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గ్లూటెన్ ఫ్రీ పిండిని తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పాల ఉత్పత్తులు:
హైపర్ థైరాయిడ్‌తో బాధపడేవారు థైరాయిడ్ హార్మోన్లను పెంచే ఆహారాన్ని తీసుకోకూడదు. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నవారు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పాలతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవద్దు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Sir Movie Review: ధనుష్ పాస్ అయ్యాడా? 'సార్' రివ్యూ అండ్ రేటింగ్ మీకోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook