Memory Improving Tips: మనం మతిమరుపుని చాలా సులభంగా తీసుకుంటాం కానీ అది ఎంతో ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.ఎందుకంటే ఇలా విషయాలు మర్చిపోయే అలవాటు ఉన్నవారికి వయసు పైబడే కొద్దీ అల్జీమర్స్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అంట. మరి ఇటువంటివి మన దరి చేరకుండా ఉండాలి అంటే మన రోజువారి లైఫ్ స్టైల్ లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుంది అవేమిటో తెలుసుకుందాం పదండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న చిన్న విషయాలను మరిచిపోయే అలవాటు క్రమంగా అల్జీమర్స్, డిమెన్షియా లాంటి పెద్ద వ్యాధులకు దారి తీసే ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు మీ మెదడుకి పదును పెడుతూనే ఉండాలి. పదును పెట్టడం అంటే షాప్నర్ తీసుకొని షార్ప్ చేయడం అనుకునేరు.. కాదండి కాస్త మనం మెదడుకి కూడా హెల్తీగా ఏదో ఒక వ్యాపకాన్ని అలవాటు చేయాలి. ఇలా మీ బ్రెయిన్ ని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచుకోవడానికి , షార్ప్ మెమరీ పెంపొందించడానికి పనికి వచ్చే ఐదు చిట్కాలు ఏమిటో మీకు తెలుసా?


రివిజన్:


మన జీవితంలో ఎప్పటికప్పుడు ముఖ్యమైన విషయాలను రివైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు చదివేటప్పుడు ఒకటికి రెండుసార్లు రివైజ్ చేసుకుంటారు చూడండి అలాగన్న మాట. మీరు ఎక్కువగా విషయాలు మర్చిపోతున్నారు అనుకుంటే ముఖ్యమైన విషయాన్ని ఒకటికి పది సార్లు తలచుకోండి, బ్రెయిన్ లో రివైజ్ చేసుకోండి. అప్పుడు అది మీకు బాగా గుర్తుంటుంది. 


మ్యూజిక్:


కొన్నిసార్లు మన మనసులో అనవసరపు చికాకులు ఎక్కువైనప్పుడు మన బ్రెయిన్ లో విషయాలు గుర్తు ఉండవు. జీవితం ఏదో అలా సాగిపోతోంది అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇలాంటప్పుడు సంగీతం ద్వారా మన మనసుని ,మెదడుని ఉత్తేజితం చేయొచ్చు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి కూడా సంగీతం వల్ల ప్రతిస్పందన వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. 


పజిల్స్:


మీకు క్రాస్‌వర్డ్‌ పజిల్స్ ఫిల్ చేయడం కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ.. ఒకసారి మొదలు పెడితే బ్రెయిన్ మొత్తం దానిమీద పనిచేస్తుంది. ఇలా మనం బ్రెయిన్ కి కాస్త పని చెప్పడం వల్ల అది యాక్టివ్ అవుతుంది.. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎలాగంటే మన దగ్గర ఉన్న స్కూటర్ ని వాడకుండా అలాగే షోకేస్ లో బొమ్మలాగా భద్రంగా ఉంచాం అనుకోండి… కొన్ని రోజులకి అది తుప్పు పట్టి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాగే మన బ్రెయిన్ కూడా వాడకపోతే ఎందుకు పనికిరాదు. కాబట్టి అప్పుడప్పుడు దానికి కూడా పజిల్స్ తో కాస్త షాక్ ఇస్తూ ఉండాలి.


మెడిటేషన్:


మెడిటేషన్.. మన ఇంద్రియాలు అదుపులోకి తేవడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా కలిగించే ఒక గొప్ప సాధనం. కళ్ళు మూసుకొని మన ఇంద్రియాలపై మనం పట్టు తీసుకురావడానికి ప్రయత్నించాలి. 


ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్న ప్రతి ఒక్క విషయం మనలో చాలామందికి తెలుసు. ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో సమస్యలు తగ్గుతాయని తెలుసు... పైగా ఇది చేయడానికి కరెక్ట్ గా ఒక ఐదు పది నిమిషాలకు మించి సమయం కూడా పట్టదు. అయినా కానీ ఎందుకో ఆచరణ విషయానికి వచ్చేసరికి మనం కాస్త అశ్రద్ధ కనబరుస్తున్నాం. మన భవిష్యత్తు అనేది దాచిపెట్టే డబ్బులో కాదు ..మూటకట్టే ఆరోగ్యంలో ఉంది.. కాబట్టి మీకు రోజు ఉండే పనులు కనీసం ఒక పది నిమిషాలు పక్కన పెట్టి పైవి ఫాలో అయ్యి చూడండి.. మతిమరుపు అనేది తప్పక తగ్గుతుంది.


Also Read  Cardamom: యాలకులతో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్‌ చేయండి ఇలా!


Also Read: Healthy Foods: మీ పిల్లలకు పరగడుపున ఈ 5 పదార్ధాలు ఇస్తే అన్ని సమస్యలకు చెక్


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter