Tips to reduce Belly fat: శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వు వల్ల.. ఎన్నో సమస్యలు వస్తాయి. ఎన్నో వ్యాధులకు కూడా కొవ్వు పెద్ద ప్రమాద కారకంగా ఉంటుంది. అయితే ఏమి చేసినా బరువు తగ్గడం లేదని కొంతమంది అంటూ ఉంటారు. బరువు తగ్గాలంటే తప్పకుండా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి.  ముఖ్యంగా మద్యపానం తగ్గించడం, ఆహారంలో ప్రోటీన్ శాతం పెరగటం, బరువులు ఎత్తడం.. వంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల.. మన శరీరంలోని.. కొవ్వును తగ్గించుకోవచ్చు. అయితే బరువు తగ్గటం కోసం మన తప్పకుండా పాటించవలసిన పనులు ఏవో చూద్దాం:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యాయామం: ఎప్పుడు కూర్చుని ఉండకుండా శరీరానికి మంచి.. వ్యాయామం కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ఏరోబిక్స్ చేయడం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. పొట్ట కొవ్వును, మొత్తం శరీర కొవ్వును తగ్గించడంలో.. కూడా వ్యాయామం ప్రభావవంతంగా ఉంటుంది. ఇంట్లోనే.. కనీసం ఉదయం లేదా సాయంత్రం అరగంటసేపు…కనీసం సింపుల్ ఎక్సర్సైజులు చేయడం చాలా అవసరం.


నిద్ర: సరైన నిద్రకి..మన బరువుకి కూడా సంబంధం ఉంటుంది. చక్కటి నిద్ర కూడా బరువు తగ్గడం కోసం చాలా అవసరం. కాబట్టి బరువు తగ్గాలి అనుకుంటే.. నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయకండి.


ఆహార నియమాలు..


బరువు తగ్గే అనుకునేవాళ్లు తమ డైట్ లో కచ్చితంగా ఇవి ఉండేలా చూసుకోవాలి. 


ఫైబర్: అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తినడానికి ప్రయత్నించండి. దానివల్ల ఎక్కువసేపు.. ఆకలి వేయకుండా ఉంటుంది. 


ట్రాన్స్ ఫ్యాట్: ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల పొట్టలో.. కొవ్వు తరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడం కోసం కాకపోయినా, ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం శరీరానికి కూడా మంచిదే.


ప్రోటీన్: ఫిష్, బీన్స్ వంటి అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల..అవి కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడతాయి.


ప్రొబయోటిక్స్: ప్రొబయోటిక్ ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన..జీర్ణ వ్యవస్థను.. ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


బరువు త్వరగా తగ్గడం కోసం వీటన్నిటినీ క్రమం.. తప్పకుండా మన జీవనశైలి లో చేర్చుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. 


అయితే బరువు తగ్గడం కోసం ఎలాంటి ఆహారాలకు, ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి అనేది కూడా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు పూర్తిగా తగ్గించాల్సినవి.‌ ఏంటో చూద్దాం.


స్ట్రెస్: స్ట్రెస్ శరీరంలో.. కొవ్వు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాబట్టి బరువు తగ్గడం కోసం స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. 


రీఫైండ్ కార్బ్స్: రీఫైండ్ కార్బ్స్ అధిక కొవ్వుకు కారణం అవుతాయి. మన ఆహారంలో రీఫైండ్.. కార్బ్స్ తగ్గించడం లేదా ఆరోగ్యకరమైన కార్బ్ పెంచుకోవడం వంటివి కచ్చితంగా చేయాలి.  


చక్కెర: అధిక చక్కెర తీసుకోవడం.. బరువు పెరగడానికి ప్రధాన కారణం. చాక్లెట్లు, బిస్కెట్స్ ఇలా ప్రాసెస్ చేయబడిన.. ఆహారాలు తగ్గించడం బరువు తగ్గడానికి చాలా ముఖ్యం.


Read more: DSC Aspirants Protest: ఓయూలో హైటెన్షన్.. ఆందోళనకారుల వెంట పడి మరీ అరెస్టులు.. వీడియో వైరల్..


Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి