Tomato Flu In Kerala: భారత్‌లో మరో అంతు చిక్కని వ్యాధి..దీని నుంచి పిల్లలను ఇలా రక్షించాలి..!!
Tomato Flu Prevention: భారత్‌లో మరో అంతు చిక్కని వ్యాధి వెలుగులోకి వచ్చింది. టమాటో ఫ్లూ అనే వింత వ్యాధి దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని కొల్లం జిల్లాలో ప్రత్యేక్షమైంది. ఈ వ్యాధిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Tomato Flu Prevention: భారత్‌లో మరో అంతు చిక్కని వ్యాధి వెలుగులోకి వచ్చింది. టమాటో ఫ్లూ అనే వింత వ్యాధి దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని కొల్లం జిల్లాలో ప్రత్యేక్షమైంది. ఈ వ్యాధిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికీ 80 మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడ్డారు. కేరళలో కోల్లాం ప్రాంతంలోనే ఈ ఫ్లూ అధికంగా పెరుగుతున్నందున ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే అధికారులు పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ ఫ్లూ రావడానికి గల కారణాలను మాత్రం ప్రభుత్వ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఈ ఇన్‌ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారు.
టొమాటో ఫ్లూ టెన్షన్:
ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు ఈ వ్యాధిని అరికట్టేందుకు వైద్యారోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. టమాటో ఫ్లూ దానిని ఎలా నివారించవచ్చో వివరంగా తెలుసుకుందాం.
టొమాటో ఫ్లూ అంటే ఏమిటి?
టొమాటో ఫ్లూ అనేది కేవలం చిన్న పిల్లలకు వచ్చే ఓ రకమైన తీవ్ర జ్వరం. ఈ వ్యాధి రావడానికి గల ఇంకా తెలియరాలేదు. దీని వెనుక డెంగ్యూ లేదా చికున్‌గున్యా కారణమని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఫ్లూ వస్తే పిల్లల చర్మంపై ఎర్రటి టమోటాల ఆకారంలో బొబ్బలు కనిపిస్తాయి. అందుకే దీన్ని టొమాటో ఫ్లూ అని అంటారు.
ఇది అంటు వ్యాధేనా..!
టొమాటో ఫ్లూ అనేది ఓ రకమైన అంటు వ్యాధి. కాబట్టి మీ చుట్టూ ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లైతే.. అతని నుంచి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలను రోగి దగ్గరికి రానివ్వవద్దని తెలుపుతున్నారు.
టొమాటో ఫ్లూ లక్షణాలు:
#చర్మంపై ఎర్రటి బొబ్బలు
#చర్మంలో చికాకు
#కీళ్ళ నొప్పి
#జలుబు
# తీవ్ర జ్వరం
#తిమ్మిర్లు
#వాంతులు
#దగ్గు
#శరీర నొప్పి
#తుమ్ములు
#అతిసారం
#అలసట
టొమాటో ఫ్లూ నివారించడానికి ఏం చేయాలి:
#మీ ఇంటి లోపల, చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలి.
#పిల్లల శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఉంటే..వాటిని గోకకుండా ఆపండి.
# పిల్లలను వ్యాధి సోకి వారికి దూరంగా ఉంచాలి.
#పిల్లలకు పండ్ల తినిపిస్తూ ఉండాలి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Stomach Gas Remedies: గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వీటిని తప్పకుండా పాటించండి..!
Also Read: Lunar Eclipse 2022: చంద్రగ్రహణం రోజున ఈ 7 నియమాలు పాటిస్తే దుష్ప్రభావాలు దూరమవుతాయి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.