Tomato for Blood pressure: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..
Tomato for high BP control: టమాటా మనందరి వంట గదిలో అందుబాటులో ఉండే కూరగాయ. ఇది ఎరుపు రంగులో పులుపుగా ఉంటుంది. టమాటా తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మన కూరలకు పులుపు అందడానికి టమాటాను ఉపయోగిస్తారు.
Tomato for high BP control: టమాటా మనందరి వంట గదిలో అందుబాటులో ఉండే కూరగాయ. ఇది ఎరుపు రంగులో పులుపుగా ఉంటుంది. టమాటా తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మన కూరలకు పులుపు అందడానికి టమాటాను ఉపయోగిస్తారు. ఇందులో ఎన్నో విటమిన్స్, న్యూట్రియన్స్, విటమిన్ సి, పొటాషియం, పోలేట్ విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రాణాంతక వ్యాధులకు కూడా వ్యతిరేకంగా పోరాడుతాయి. అయితే హై బీపీ, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి కూడా టమాట వరం. ఇది ఏ విధంగా మనకు ఆరోగ్యకరమో తెలుసుకుందాం..
హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడేవారు సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఈ పొటాషియం ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల హైబీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. టమాటాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బిపి లెవెల్ ని తగ్గిచేస్తుంది. హెల్త్ లైన్ నివేదిక ప్రకారం యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది
హైబీపీకి కారణాలు..
అనారోగ్యకరమైన ఆహారాలు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఆల్కహాల్ అతిగా తీసుకోవడం, డయాబెటిస్, ఒబేసిటీ స్ట్రెస్.
పోషకాల పవర్ హౌస్ టమాట..
టమాటాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి వరం ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్, పొటాషియం, మినరల్స్ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని కాపాడమే కాకుండా చర్మానికి కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
ఇదీ చదవండి: బిల్వపత్రం పరగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో చూడండి..
క్యాన్సర్ కు వ్యతిరేకం..
టమాటాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇవి రుచిగా ఉండటమే కాకుండా ప్రాణాంతక క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ యాంటీ క్యాప్సినోజైనిక్ గుణాలు కలిగి ఉంటుంది ఇది కడుపు, కాలేయ సంబంధిత క్యాన్సర్లకు చెక్ పెడుతుంది.
గుండె ఆరోగ్యం..
టమాటాల్లో ఆరోగ్యకరమైన ఖనిజాలు ఉంటాయి. ఫైబర్, ఖోలిన్, విటమిన్ సి, పొటాషియం ఉండటం వల్ల గుండెకు మంచిది. అంతే కాదు హెల్త్ లైన్ నివేదిక ప్రకారం లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ ను మన శరీరం నుంచి తరిమేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.
ఇదీ చదవండి: హోటళ్లలో తిన్న ఆహారమేకాదు.. ఇలా చేస్తే ఇంట్లో వండుకున్నా అనారోగ్యం బారినపడతారు..
చర్మ ఆరోగ్యం..
చర్మ ఆరోగ్యానికి టమాటాను డైట్లో చేర్చుకోవాల్సిందే. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు టమాటా జ్యూస్ ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది. ముఖంపై ఉన్న యాక్నేను తొలగిస్తుంది. ముఖ రంధ్రాలు తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి