Tooth Sensitivity Cure: మనలో చాలామందికి దంతక్షయం కారణంగా తరచుగా నొప్పి వస్తుంది. ఒక్కోసారి ఒక్కో పంటి సమస్య వెంటాడుతుంది. ఈ సమస్య ప్రస్తుతం చాలామందిలో సాధారణమైనప్పటికీ, దీనిని తేలికగా తీసుకోకూడదు. చల్లని లేదా వేడి ఆహారం కారణంగా దంతాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటప్పుడు దంతాల విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దంతాలు ఎనామెల్ పొరతో కప్పబడి ఉంటాయి. అయితే దంతాల లోపలి పొరను డెంటిన్ అంటారు. పై పొర తొలగించబడినా లేదా దానికి ఏదైనా విధంగా దెబ్బతిన్నట్లయితే డెంటిన్ బాహ్య వాతావరణంతో సంబంధంలోకి వస్తుంది. అది టూత్ సెన్సిటివిటీకి కారణంగా మారుతుంది. ఈ టూత్ సెన్సిటివిటీని నివారించుకునేందుకు 5 మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


టూత్ సెన్సిటివిటీ నివారించడానికి 5 మార్గాలు:


1. లవంగం నూనె:


లవంగం నూనె టూత్ సెన్సిటివిటీ కలిగిన దంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. నొప్పి నివారిణిగా ఉంటుంది. దీని ఉపయోగం నోటి సూక్ష్మజీవులను తొలగించడానికి సహాయపడుతుంది.


2. వెల్లుల్లి:


దంతాల నొప్పితో మీరు చాలా ఇబ్బంది పడినట్లయితే.. వెల్లుల్లి మొగ్గను కత్తిరించి, నేరుగా మీ దంతాల ప్రభావిత ప్రాంతాలకు పూయండి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ దంతాలపై ఉండే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. టూత్ సెన్సిటివిటీకి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.


3. ఉప్పు నీటితో కడగడం:


రోజుకు రెండుసార్లు ఉప్పు నీటితో నోరు కడుక్కోవడం వల్ల దంతాలలో సెన్సిటివిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉప్పు ఒక సహజ క్రిమినాశకం. గోరువెచ్చని నీటిలో ఉప్పును కలిపి నోటిలో పోసుకొని పుక్కలించాలి. ఇలా రోజు చేయడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 


4. గ్రీన్ టీ:


దంతాల తెల్లబడటం కోసం గ్రీన్ టీని రోజుకు రెండుసార్లు మౌత్ వాష్‌గా ఉపయోగించండి. గ్రీన్ టీ మీ దంతాలను బలోపేతం చేయడం సహా టూత్ సెన్సిటివిటీ తగ్గించడానికి సహాయపడుతుంది.


5. ఉల్లిపాయలు:


ఉల్లిపాయ యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ప్రసిద్ధి. ఉల్లిపాయను కట్ చేసి, సెన్సిటివిటీ ఉన్న దంతాలపై 5 నిమిషాలు ఉంచండి. మీరు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా.. కొందరు వైద్యుల సూచన మేరకు అందిచబడింది. వీటిని పాటించే ముందు మరోసారి వైద్యుడ్ని సంప్రదిస్తే మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 


Also Read: Pillow and Bed: బ్యాక్ పెయిన్..నెక్ పెయిన్ సమస్య వెంటాడుతోందా..అయితే ఇలా చేయండి


Also Read: Diabetes Reduction Diet: రక్తంలో చక్కెర స్థాయి తగ్గాలంటే ఈ ఆహార నియమాలు పాటించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.