Toothache Remedies: పంటి నొప్పి ఎంత సామాన్యమైందో అంతగా నరకం చూపిస్తుంది. మీరు కూడా భరించలేని పంటి నొప్పితో విలవిల్లాడుతుంటే..కొన్ని సులభమైన చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పంటి సమస్యలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. పంటి నొప్పి ప్రధాన సమస్యగా మారుతోంది. ఇదొక సామాన్యమైన రుగ్మతే అయినా..నొప్పి మాత్రం నరకయాతన అనుభవించేలా చేస్తుంది. ఏ పని కూడా చేయలేరు. పంటి నొప్పి లేదా పంటి సంబంధిత సమస్యలు వెంటాడినప్పుడు కొన్ని సులభమైన వంటింటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. 


లవంగమనేది అందరికీ తెలిసిందే. తినే ఆహార పదార్ధాల రుచి పెరిగేందుకు వినియోగిస్తుంటారు. అయితే పంటి నొప్పుల్నించి ఉపశమనం పొందేందుకు లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు చేయాల్సిందిల్లా..లవంగాల నూనెను దూది సహాయంతో నొప్పి ఉన్న దంతాలకు రాసుకోవాలి. లేదా లవంగాన్ని నేరుగా ఆ పంటి కింద పెట్టుకున్నా ఫలితముంటుంది. 


ఇక రెండవ చిట్కా వెల్లుల్లితో.వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. ఫలితంగా పంటి సమస్యలకు వెల్లుల్లి వాడితే అన్నీ దూరమౌతాయి. వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా మెత్తగా చేసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. దీనివల్ల పంటిలోని కీటకాలు చనిపోతాయి. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 


మూడవది ఐస్ థెరపీ పంటి నొప్పుల్ని ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ ముక్కలతో ఉపశమనం పొందుతుంటారు. దీనికోసం కొన్ని ఐస్ ముక్కల్ని తీసుకుని ఓ వస్త్రంలో చుట్టి దవడ దగ్గర పెట్టుకుని కాపరం చేయాలి. ఇలా చేయడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.


ఇక నాలుగో చిట్కా జామాకులు. ఇది అందరికీ తెలిసిందే అయినా అద్భుతంగా పనిచేస్తుంది. జాంకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. జామాకులతో కూడా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. పంటి నొప్పులున్నప్పుడు లేత జామాకుల్ని నమిలి తింటే చాలావరకూ ఉపశమనం కలుగుతుంది. లేదా జామాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి..ఆ నీటితో మౌత్‌వాష్ చేయాలి. 


Also read: Cholesterol Lowering Oil: లెమన్‌గ్రాస్ ఆయిల్‌తో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను 10 రోజుల్లో తగ్గించుకోవచ్చు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.