Piles Home Remedies In telugu: నేటికాలంలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు తాగడం, మలబద్ధకం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. పైల్స్ ఉన్నప్పుడు, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దురద,  రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి వాము ఎంతగానో సహాయపడుతుంది. దీని కోసం మీరు కొన్ని పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పైల్స్ సమస్యకు వాము:


కావలసినవి:


ఒక కప్పు వాము
ఒక గ్లాసు పలుచని మజ్జిగ
పావు స్పూన్ నల్ల ఉప్పు


తయారీ విధానం:


వామును మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోండి. ఒక గ్లాసు పలుచని మజ్జిగ తీసుకొని దానిలో పావు స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూన్ వాముపొడి వేసి బాగా కలపాలి.


సేవించే విధానం:


ఈ మజ్జిగను ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగాలి. పైల్స్ సమస్య తగ్గే వరకు ఈ విధంగా తాగుతూ ఉండాలి.


మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:


వాములో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పైల్స్ వల్ల కలిగే నొప్పి, వాపు, ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల ఉప్పు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మజ్జిగలో పుష్కలంగా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి.


పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు అధిక మసాలాలు, కారాలు జీర్ణవ్యవస్థకు హానికరం కావచ్చు. వీటికి బదులుగా అధిక ఫైబర్‌ కంటెంట్‌ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక చోటునే కూర్చోవడం తగ్గించాలి. ఐదు నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది. అలాగే నీరును అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఫైల్స్‌ బారిన పడకుండా ఉంటాము. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. బరువు నియంత్ర చాలా అవసరం. అలాగే ధూమపానం, మద్యపానం మానుకోవాల్సి ఉంటుంది. తేలిక బటలు వేసుకోవాల్సి ఉంటుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఫైల్స్‌ సమస్య నుంఇ బయటపడవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల పైల్స్ సమస్య త్వరగా తగ్గే అవకాశం ఉంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి