Breathing Exercises For Lungs: కరోనా మహమ్మారి వచ్చిన దగ్గరనుంచి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. కానీ మన శరీరం పనితీరుకి ఊపిరితిత్తులు ప్రధానమైనవి. మనిషికి గుండె ఎంత ముఖ్యమో ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం కూడా అంతే అవసరం. కానీ కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎంతోమంది శ్వాస, ఉదర సంబంధ నొప్పులను ఎదుర్కొంటున్నారు. కాగా వీటి నుంచి బయట పడడానికి మందులపైన ఆధారపడటం కూడా అంత మంచిది కాదు. సహజమైన శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా శ్వాస సంబంధమైన ఎన్నో సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ వ్యాయామాలు ఏవి ఎలా చేయాలి ఒకసారి చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు


రోజూ ఉదయం లేవగానే.. కనీసం ఒక 15 నిమిషాలు బ్రీతింగ్ వ్యాయామాలు చేయాల్సిందే. డీప్ బ్రీతింగ్ వ్యాయామాల్లో ప్రధానమైనవి… ప్రాణాయామం, కపాలభాతి, అనులోమ్ విలోమ్.. ఇవి… యోగాసనాలు. ఇవి ప్రతి రోజు క్రమం తప్పకుండా వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మన ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.


డయాఫ్రగ్మాటిక్ బ్రీతింగ్ టెక్నిక్:


డయాఫ్రగ్మాటిక్ బ్రీతింగ్ అంటే.. వీలైనంత గాలిని ముక్కు ద్వారా పీల్చి మళ్లీ దానిని వదలడం. ఇలా రోజు ఓ ఐదు నిమిషాలు చేసిన మనకు చాలా మేలు చేకూరుతుంది.


ఈ ఎక్సర్సైజ్ చేయటం కోసం మీరు ఈ కింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి..


స్టెప్ 1: తల దిండు పైన పెట్టి మీ వెనక భాగాన్ని నిటారుగా ఆనించి పడుకోండి


స్టెప్ 2: కొంచెం మీ భుజాల రిలాక్స్ చేసి.. ఒక చేతిని బొడ్డుపై, మరో చేతిని ఛాతీపై ఉంచండి.


స్టెప్ 3: ఇప్పుడు మీ ముక్కు ద్వారా రెండు సెకండ్లు గాలిని బాగా లోపలికి పీల్చుకోండి.


స్టెప్ 4: ఆ తరువాత మీ నోటి ద్వారా 2 సెకన్‌ల పాటు గాలిని బయటకు పంపండి. 



4-7-8 బ్రీతింగ్ :


ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 4 సెకన్‌ల పాటు శ్వాస తీసుకోవడం, 7 సెకన్‌ల పాటు శ్వాసను వదలడం, ఆ తరువాత 8 సెకన్‌ల పాటు శ్వాసతీసుకోవడం 


స్టెప్ 1: మీ చేతులలో పొత్తికడుపుపై ఉంచి కుర్చీపై సౌకర్యవంతంగా కూర్చోవాలి


స్టెప్ 2: గాలిని పీల్చుకోవడం, వదలడం ద్వారా ప్రాథమిక శ్వాస కండరాలు విశ్రాంతి తీసుకోవడంలో నిమగ్నం అవుతాయి


స్టెప్ 3: ఆ తరువాత ముక్కు ద్వారా మూడు సెకండ్లు గా లిని తీసుకొని, 7 సెకన్‌ల పాటు శ్వాసను వదలండి. ఇక మీ నోటి ద్వారా 8 సెకన్‌ల పాటు గాలిని విడిచిపెట్టండి.


బెలూన్ బ్రీతింగ్:


ఈ టెక్నిక్ మనకు తెలియని కానీ చాలా సులువు అయింది. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మరేదో ఎక్ససైజ్ కాదు కేవలం బెలూన్స్ ని ఊదడం. బెలూన్స్ ఊదడం లంగ్స్‌కు మంచి వ్యాయామం. రీసెర్చర్స్ దీన్ని అప్రూవ్ కూడా చేశారు. బెలూన్స్ గట్టిగా ఊదడం కోసం.. మనం గాలిని వేగంగా పీల్చుకొని మళ్లీ బెలూన్ లోకి వదలాల్సి ఉంటుంది. దీనివల్ల మన ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం అంది అవి బాగా పనిచేస్తాయి.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి