9 health problems solved with Drink Beetroot Juice: ప్రస్తుత రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో తీసుకునే ఆహారం, నిద్రలేమి, పనిభారం, మానసిక ఒత్తిడి లాంటి తదితర కారణాల వల్ల మనిషి త్వరగా అనారోగ్యానికి గురవుతున్నాడు. అయితే మనం తీసుకునే ఆహారంతోనే కొన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. చలికాలంలో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్‌-బి, విటమిన్‌-సి, ఫాస్పరస్‌, కాల్షియం, ప్రొటీన్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు మధుమేహం, గుండె, రక్తహీనత వంటి వ్యాధులకు మేలు చేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా మందికి బీట్‌రూట్‌ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దానిని పచ్చిగా తినేందుకు అయినా లేదా జ్యూస్‌ తాగేందుకు అయినా పెద్దగా ఆసక్తి చూపరు. కానీ బీట్‌రూట్‌ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పచ్చి బీట్‌రూమ్‌ను తినడం ఇష్టం లేని వారు కనీసం జ్యూస్‌ చేసుకుని అయినా తాగండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బీట్‌రూమ్‌ జ్యూస్‌ను ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


రక్తహీనత:
బీట్‌రూట్ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జ్యూస్‌ రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రక్తం త్వరగా తయారయ్యేందుకు బీట్‌రూట్ జ్యూస్‌ ఉపయోగపడుతుంది. రోజు జ్యూస్‌ తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. చలికాలంలో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. 


హైబీపీ, గుండె జబ్బు:
హైబీపీ ఉన్న వారికి బీట్‌రూట్‌ మంచి ఔషధంగా పని చేస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కొలెస్టాల్‌ అధికంగా ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు.


చర్మానికి మేలు:
బీట్‌రూట్ రసం చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. రక్తం శుభ్రమైనప్పుడు చర్మ కణాలు మెరుస్తాయి. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మ సమస్యలు దూరమై ముఖం కాంతివంతంగా మారుతుంది. 


లివర్‌:
బీట్‌రూట్ జ్యూస్ వల్ల లివర్‌ శుభ్రం అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. లీవర్‌ పని తీరు మెరుగుపడుతుంది. నిత్యం బీట్‌రూట్ జ్యూస్‌ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎముకలను గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్‌రూట్‌కు ఉంటుంది. 


గర్భిణులు:
బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల గర్భిణులకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది. కడుపులో ఉండే బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా అందుతుంది. బీట్‌రూట్‌ కడుపులో పెరిగే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. 


Also Read: ఈ చౌకైన స్కూటర్‌కు విపరీతమైన డిమాండ్.. 1338% పెరిగిన అమ్మకాలు! యాక్టివా, జూపిటర్ మాత్రం కాదు


Also Read: Hawaii Flight Turbulence: విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు.. 36 మందికి తీవ్ర గాయాలు! పైకప్పుకు కూడా క్రాక్స్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.