Weight loss for Dry Fruits: పెరుగుతున్న బరువు తగ్గించుకోవటం ఎవరికీ అంత సులభం కాదు.  కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీరు అధిక బరువును చాలా వరకు నియంత్రించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. మీ అల్పాహారం ఆరోగ్యకరంగా లేకపోతే, శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్, ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తింటే, బరువు తగ్గడం సులభం అవుతుందని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నానబెట్టిన ఎండుద్రాక్ష వల్ల కలిగే లాభాలు:
రాత్రి సమయంలో ఒక కప్పు నీళ్లల్లో కొన్ని ఎండు ద్రాక్షలని నానబెట్టాలి. తరువాత రోజు ఉదయాన్నే నీళ్ళని వేరు చేసి..  నానిన ఎండుద్రాక్షలను తినాలి. ఈ విధంగా ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండు ద్రాక్షలను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. శరీరంలో దీని ప్రభావం కొన్ని రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతుంది. 


బరువు తగ్గిస్తుంది:
శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారు మరియు బరువు తగ్గించుకోటానికి ప్రయత్నించి విఫలం అయ్యే వారు.. నానా బెట్టిన ఎండు ద్రాక్షలను తినటం వలన ప్రయోజనాలను పొందుతారు. ఇలా నానబెట్టింగ్ ఎండు ద్రాక్షని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల పొట్ట మరియు నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది. వీటిలో ఉండే ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ నడువు చుట్టూ ఉండే కొవ్వు తగ్గించటంలో దోహాద పడతాయి. 


Also Read: Ujjwala Scheme: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం తీపి కబురు.. ఫ్రీగా 75 లక్షల కనెక్షన్లకు గ్రీన్‌ సిగ్నల్  


మలబద్దకం సమస్యలో తగ్గుదల:
పొట్టను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. శరీరంలో ఈ ప్రక్రియలో ఏదైనా సమస్య కలిగితే దాని వల్ల ఎన్నో సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండు ద్రాక్షని తినడం వల్ల శరీరానికి ఫైబర్ మరియు ఇతర పోషకాలు లభ్యంతో పాటు మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది. 


అనీమియా : 
ఎండుద్రాక్షలో ఐరన్ పరిమాణం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే రక్తానికి మరియు రక్త ప్రసరణకు ఎంతో ఉపయోగపడే పోషకం. రక్త హీనత సమస్యతో బాధపడే వారు ఉదయం అల్పాహారానికి ముందు కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వలన అనీమియా వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. 


Also Read: Pawan Kalyan: రాజమండ్రి జైలుకు పవన్ కళ్యాణ్.. నారా లోకేష్‌కు రజనీకాంత్ ఫోన్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook