Tulsi Seeds Benefits: తులసి గింజల ప్రయోజనాలు తెలిస్తే..జీవితంలో వదిలిపెట్టరు
Tulsi Seeds Benefits: ఆయుర్వేదం ప్రకారం తులసి ఆకులకు విశేష మహత్యముంది. తులసి ఆకులు, తులసి గింజలతో అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ప్రతి ఆయుర్వేద మందులో తులసి తప్పకుండా ఉంటుంది.
తులసి మొక్క లాభాలు అనేకం. తులసి మొక్క హిందూవులకు ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత కలిగిందో..ఆయుర్వేదపరంగా అంతకుమించి ప్రయోజనాలు కలిగి ఉంది. తులసి ఆకులే కాదు..తులసి గింజలు కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఆధాత్మికంగా మహత్యు కలిగింది కావడంతో తులసి మొక్క దాదాపుగా అందరి ఇళ్లలో ఉంటుంది. పెరట్లోనే లేదా కుండీలోనో అమర్చుకుంటుంటారు. సాధారణంగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు తులసి ఆకుల్ని ఉపయోగిస్తుంటాం. కానీ తులసి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. తులసి గింజల ఉపయోగాలు చూద్దాం..
1. తులసి గింజలతో మానసిక ఒత్తిడిని జయించవచ్చు. డిప్రెషన్ లేదా స్ట్రెస్‌తో బాధపడుతుంటే..తులసి గింజల్ని నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
2. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి తులసి గింజలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి..ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తీనడం వల్ల త్వరగా ఆకలేయదు. క్రమంగా బరువు తగ్గుతారు.
3. ఒకవేళ మీకు అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్ సమస్య ఉంటే..తులసి గింజల్ని నీళ్లలో నానబెట్టాలి. ఈ నీళ్లను గింజలతో సహా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య పోతుంది.
4. రోగ నిరోధక శక్తి ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. చాలా రోగాల్నించి కాపాడేది ఇదే. కరోనా వైరస్ సమయంలో కూడా ఇమ్యూనిటీ కీలకపాత్ర పోషించింది. తులసి గింజలతో ఇమ్యూనిటీని వేగంగా పెంచవచ్చు.
Also read: Cancer Risk: వేళకు తినకపోతే కేన్సర్ ముప్పు తప్పదు, ఆందోళన కల్గిస్తున్న తాజా అధ్యయనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook