Tulsi Seeds: ప్రకృతిలో లభించే విలువైన ఔషధ మొక్కల్లో తులసి అత్యంత కీలకమైంది. తులసి గింజల ప్రయోజనాలు తెలుసుకునే కొద్దీ ఎక్కువ. తులసి మొక్క నిజంగానే అద్భుతమైన ఔషధ మొక్క. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి మొక్కంటే కేవలం ఆధ్యాత్మికంగానే చూడవద్దు. హిందూవులు పవిత్రంగా పూజించే తులసి మొక్కలో అద్భుతమైన ఔషధగుణాలున్నాయి. అందులో తులసి మొక్కను ఆరోగ్యప్రదాయినిగా పిలుస్తారు. తులసి ఆకులు, తులసి గింజలతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. క్యాన్సర్ కణాల్ని పెరగకుండా చేయడంలో తులసి గింజలు అద్భుతంగా పనిచేస్తాయని ఎంతమందికి తెలుసు. 


తులసి ఆకులతో సమానంగా తులసి గింజల ప్రయోజనాలున్నాయి. తులసి గింజల్ని నిత్యం తీసుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. తులసి గింజల్లో మనిషి శరీరానికి కావల్సిన పోషకాలు సరైన మోతాదులో లభిస్తాయి. తులసి గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తులసి గింజల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్‌‌లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఫలితంగా సీజనల్ వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది. తులసి గింజల్ని ఎలా తీసుకోవాలి, ఏం ప్రయోజనాలున్నాయో వివరంగా పరిశీలిద్దాం.


తులసి విత్తనాల్ని ప్రతి రోజూ తింటే కొల్లాజెన్ ఉత్పత్తి జరుగుతుంది. ఫలితంగా కొత్త చర్మకణాలు వృద్ధి చెందుతాయి. చర్మం ముడతల్ని తులసి గింజలు అద్భుతంగా నివారిస్తాయి. దాంతో వృద్ధాప్యపు ఛాయలు తగ్గిపోతాయి. ఇక తులసి గింజల్ని ఎండబెట్టుకుని మెత్తని పొడిగా చేసుకుని ఉంచుకోవాలి. ఈ పౌడర్ ను ప్రతిరోజూ పాలలో కలుపుకుని తాగితే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. మరోవైపు రక్తనాళాల్లో ఉండే కొవ్వుశాతం తగ్గుతుంది. తులసి విత్తనాల్లో ఐరన్, విటమిన్ కే, ప్రోటీన్‌లు సమృద్ధిగా ఉన్నాయి. తులసి గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే..జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్థి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.


తులసి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ పావుకప్పు తులసి విత్తనాల్ని నీటిలో నానబెట్టుకుని..కొద్దిగా బెల్లం, పెసరపప్పు కలిపి తింటే ఆకలి తగ్గుతుంది. నెమ్మదిగా బరువు తగ్గించుకోవడంలో దోహదపడుతుంది. తులసి గింజల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కారణంగా గుండె సంబంధిత వ్యాధుల్నించి రక్షణ పొందవచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి.తులసి విత్తనాల్లో ఉండే యాండీ ఆక్సిడెంట్స్ కారణంగా శరీరంలోని కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి. ఫలితంగా మీలో వృద్ధాప్య ఛాయలు దూరమౌతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. 


Also read: Black Coffee Benefits: అధికబరువుతో బాధపడుతున్నారా..బ్లాక్ కాఫీ అద్భుత ప్రయోజనాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.