దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మధుమేహ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ బాధిస్తోంది.జ్వరం, దగ్గు.. ఇదివరకు కామన్ గా వినిపించేవి. ఇప్పుడు బీపీ, షుగర్ లు వినిపిస్తున్నాయి. షుగర్ కంట్రోల్ పెట్టుకొవడానికి బాధితులు అష్టకష్టాలు పడుతుంటారు. ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు. ఇక మీదట అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు యూకే పరిశోధకులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్య వీరు ఒక కొత్త పరిశోధన చేశారట. ప్రత్యేకంగా షుగర్ కోసం ఒక కొత్తరకం పిల్ ఉన్న మందును కూడా కనిపెట్టారట. ఇది టైప్2 డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. బరువును కూడా తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టైప్2 షుగర్ బాధితులే ఎక్కువని ఆరోగ్య సూచీ లెక్కల్లో తేలింది. క్లోమం తక్కువ పరిణామంలో ఇన్సులిన్ విడుదల చేయడం వల్ల టైప్1 మధుమేహం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో విపరీతంగా పెరగటం వల్ల టైప్2 మధుమేహం వస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి, ఊబకాయం ఇందుకు ఇతర కారణాలు అని పేర్కొనింది. 


లీసెస్టర్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు మెలానియే డేవీస్‌, తన సహోద్యోగులు కలిసి ఈ పరిశోధనలో 632 మంది టైప్‌2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థులకు ప్లేసిబో, సెమాగ్లుటైడ్‌ మందులను వివిధ డోసుల్లో 26 వారాల పాటు ఇచ్చి అబ్సర్వేషన్ లో ఉంచారు.  అందులో ప్లేసిబో మందు తీసుకున్నవారికంటే సెమాగ్లుటైట్‌ మందు తీసుకున్న వారిలో 5 శాతానికిపైగా బరవు తగ్గడాన్ని గుర్తించారు. పరిశోధనకు సంబంధించిన వ్యాసాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.