Unhealthy Intestine: ప్రేగులు కూడా శరీరంలో ముఖ్యమైన అవయవాలే. ఎందుకంటే జీర్ణవ్యవస్థను అనుసంధానం చేసి వ్యర్ధాలను బయటకు పంపించేందుకు ప్రేగులు పాత్ర విశేషమైనది. ఒకవేళ ఇవి స్తంభించి తీవ్ర సమస్యలకు గురైతే రకాల పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటి ప్రభావం జీర్ణ వ్యవస్థ పై పడి అది దెబ్బ తినే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేగులను జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రేగు ఆరోగ్యం కోసం ఏమి చేయాలి..?


1. ప్రతిరోజు తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి.  అంతేకాకుండా పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో గింజలు, పండ్లు, మొలకలు నేర్చుకోవాల్సి ఉంటుంది. వీలైతే ఆహారాల్లో నూనె మసాలాలను అతిగా వినియోగించకపోవడం చాలా మంచిది. 


2. ప్రొటీన్‌ని ఆహారంలో చేర్చుకోండి:
అధికంగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే పేగులకు మేలు  చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారంలో గుడ్లు, చీజ్, తృణధాన్యాలు, పప్పులు, సోయాబీన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.


3.ఆధునిక జీవన శైలి:


చాలామంది ఆధునిక మన శైలిని అనుసరిస్తున్నారు. లో భాగంగానే బయట లభించే అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా చాలామంది బిజీ లైఫ్ కారణంగా వ్యాయామాలు కూడా చేయలేకపోతున్నారు.


Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  


Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook