Unknown Facts About Ragi Java: రాగిజావ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Unknown Facts About Ragi Java: ప్రతిరోజు రాగిజావను తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ కింది వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా రాగిజావను తీసుకోవాల్సి ఉంటుంది.
Unknown Facts About Ragi Java: రోజంతా శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది రోడ్లపై లభించే అనారోగ్య కరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి కోల్పోయి..రోజంతా అలసిపోతూ పనిచేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన ఓ చిన్న ఇంటి చిట్కాతో శరీరాన్ని దృఢంగా శక్తివంతంగా తయారు చేసుకోవచ్చు.
ప్రతిరోజు యాక్టివ్ గా పని చేయడానికి తప్పకుండా శరీరానికి తగిన పరిమాణంలో పోషకాలు అందించే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా మన పూర్వీకులు తీసుకున్న తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో దృఢంగా తయారవుతుంది. ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిరోజు తొందరగా అలసిపోయేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు రాగుల పిండితో తయారు చేసిన జావ లేదా రోటీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చుట. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు సహాయపడతాయి..
రాగి ప్రయోజనాలు:
రాగుల పిండితో తయారుచేసిన జావాను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో ప్రొటీన్, కాల్షియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడేందుకు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా మధుమేహంతో పడుతున్నవారు చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజు ఈ జావాను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.
రాగి జావా తయారీ పద్ధతి, కావాల్సిన పదార్థాలు:
✾ రాగి పిండి ఒక కప్పు
✾ ఉల్లిపాయ ఒక కప్పు
✾ సన్నగా తరిగిన అల్లం ఒకటి స్పూన్
✾ వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్
✾ 4 నుంచి 5 లవంగాలు
✾ 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి
✾ నెయ్యి
✾ మీకు నచ్చిన కూరగాయలు (క్యారెట్, బ్రోకలీ, క్యాప్సికమ్, బఠానీలు, బీన్స్)
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
తయారీ పద్ధతి:
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని బాగా వేడి చేసి అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన ఉల్లిపాయను వేసుకొని బాగా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మీకు నచ్చిన కూరగాయలను ఇదే బౌల్లో వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీటిని పోసుకొని మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని వేసి ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఓ 15 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వ్ చేసుకోవచ్చు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter