Uric Acid Control Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు చాలా రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీనినే చాలా మంది  హైపర్యూరిసెమియా అని అంటారు.  ఇది శరీరంపై కీళ్ల సమస్యల రూపంలో కనిపిస్తుంది. అయితే ఈ సమస్యలు ఎక్కువగా చలి కాలంలో వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ యాసిడ్‌ పరిమాణాలను స్థాయిలను పరీక్షించుకోవడానికి తప్పకుండా సీరమ్ యూరిక్ యాసిడ్ స్థాయి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలు:
>>టీ, కాఫీ, మాంసం, చేపలు, చాక్లెట్‌లను ఎక్కువగా తీసుకోవడం కారణంగా రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
>>దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉండేవారిలో కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.
>>శరీరంలో ఎంజైమ్ లోపం వల్ల కూడా హైపర్యూరిసెమియా ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.


యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే వ్యాధులు:
యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు వస్తాయని అందరికీ తెలిసిందే.. యూరిక్‌ స్థాయిలు రక్తంలో అదుపులో లేకపోవడం కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉండవచ్చు.


యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి:
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మాంసం, చేపలు, కాఫీ, టీ, చాక్లెట్లకు దూరం ఉండాల్సి ఉంటుంది.
యాసిడ్‌ను అధిగమించడానికి పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలి.
ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది.
నారింజ, నిమ్మరసం, ఉసిరికాయ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: IND Vs NZ: శుభ్‌మన్ గిల్ Vs పృథ్వీ షా.. హార్ధిక్ పాండ్యాను ఆడుకుంటున్న నెటిజన్లు    


Also Read: Ind Vs NZ: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ మెరుపులు వృథా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook