Foods to Cure Arthritis in 2 Days: కీళ్ల నొప్పులా..? వీటిని తినండి.. 2 రోజుల్లో పరిగెత్తుతారు
Cure Arthritis in 2 Days: ప్రస్తుతం చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పలు రకాల ఆహార చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
Get Relief from Arthritis in 2 Days: అందరిలో యూరిక్ యాసిడ్ పెరగడం అనేది ప్రస్తుతం ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. శరీరంలో హానికరమైన టాక్సిన్స్ స్థాయిలు అధికంగా పెరగడం కారణంగా యూరిక్ యాసిడ్ సమస్యలు వస్తున్నాయి. దీంతో సులభంగా కీళ్లలో క్రస్ట్‌లు ఏర్పడి తీవ్ర సమస్యలు వస్తున్నాయి.
కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పలు రకాల ఆహారాలు తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా యూరిక్ యాసిడ్ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ తగ్గించే ఆహారాలు:
1. టొమాటో:
ప్రస్తుతం టొమాటోలు లేకుండా ఆహార పదార్థాలు తయారు చేయడం కష్టంగా మారింది. అయితే ఇలా ప్రతి రోజూ వంటకాల్లో టొమాటోలను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
2. ఆరెంజ్:
ఆరెంజ్ పండులో కూడా విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ 500 mg విటమిన్ సి కలిగిన నారింజ పండ్లను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. ఫైబర్ ఆధారిత ఆహారం:
బరువు తగ్గాలనుకునేవారికి ఫైబర్ ఆధారిత ఆహారం తీసుకోవడం చాలా మంది. అయితే ఇది బరువును తగ్గించడమేకాకుండా యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ ఆహారాలలో తృణధాన్యాలు, వోట్స్, బ్రోకలీ, సెలెరీ తీసుకోవాల్సి ఉంటుంది.
4. చెర్రీ:
తరచుగా చెర్రీని కేక్‌తో పాటు తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆరోగ్య గుణాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను అందిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook