Vegetables For Diabetes: ఈ 3 కూరగాయలు మధుమేహన్ని నియంత్రిస్తాయి..అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!!
Vegetables For Diabetes: ప్రస్తుతం భారత్‌లో చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి అనుగుణంగా విషపూరిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ వ్యాధికి లోనవుతున్నారు. చాలా మంది శరీరాల్లో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా కష్టంగా మారింది.
Vegetables For Diabetes: ప్రస్తుతం భారత్‌లో చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి అనుగుణంగా విషపూరిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ వ్యాధికి లోనవుతున్నారు. చాలా మంది శరీరాల్లో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా కష్టంగా మారింది. ఆరోగ్య నిపుణులు తెలిలిపిన వివరాల ప్రకారం కొన్ని అంశాలను పాటిస్తే మధుమేహన్ని నియంత్రించవచ్చని అంటున్నారు. ఈ వ్యాధిని మందుల ద్వారా కాకుండా మంచి ఆహారం తీసుకోవడం ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి మధుమేహాన్ని నియంత్రించడానికి ఆహారంలో ఈ మూడు రకాల కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆ కూరగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
1. క్యారెట్:
చలికాలంలో ఎక్కువగా లభించే కూరగాయ క్యారెట్ ఒకటి. క్యారెట్లలో చాలా రకాల పోషకాలుంటాయి. కనుక మానవ శరీరానికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని తినడం వల్ల కంటి చూపు సమస్యలు తగ్గడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది. అలాంటప్పుడు దీన్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ కూడా నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
2. క్యాబేజీ:
క్యాబేజీ చాలా మందికి ఈ కూరాగాయ అంటే ఇష్టముండదు. కానీ డయాబెటిస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది.
నిజానికి క్యాబేజీలో స్టార్చ్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కావున పేషెంట్లు ఈ క్యాబేజీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలోని షురర్ స్థాయిని అదుపులో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దీన్ని సలాడ్‌లలో కూడా ఉపయోగించవచ్చని సూచించారు.
3. దోసకాయ:
అందరికీ తెలిసు దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. వేసవిలో దీన్ని అందరు ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు. దీని వల్ల శరీరంలో నీటి కొరత తగ్గించడమే కాకుండా..షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి లాభానిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: CSK vs DC: ఓల్డ్ మ్యాన్ బాగా ఆపావు.. చెన్నై స్టార్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఎంఎస్ ధోనీ!
Also Read: Viral Video: ఆ పిల్లాడు చేసిన చిలిపికి స్వీపర్ వణికిపోయాడు..నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook