Top 10 Home Remedies For Pimples: మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతుంటారు.  దీనికోసం మార్కెట్‌ లో లభించే క్రీమ్‌లు , ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కొంతమందిలో చెంపపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ మొటిమల వల్ల ఆందోళన చెందుతారు. యర్, గ్లోయింగ్ స్కిన్ తిరిగి పొందాలంటే  మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాల ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెంపపై మొటిమలను తొలగించే చిట్కాలు ఇవే: 


పసుపు: 


పసుపులో యాంటీ-వైరల్ యాక్టివిటీని కలిగి ఉందని.  ఇది కేవలం వంటలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఇది చర్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.చెంపపై మొటిమలకు కూడా రెమెడీగా పనిచేస్తుంది.


𓇊 పసుపును తేనెతో కలిపి పేస్ట్ లా చేసి మీ చెంపలపై ఇరువైన నిమిషాల తర్వాత మీ ముఖాన్ని బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


టీ ట్రీ ఆయిల్: 


టీ ట్రీ ఆయిల్  చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగాపడుతుంది. ఈ ఆయిల్‌లో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాని తొలగించడంలో సహాయపడుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.


𓇊 టీ ట్రీ ఆయిల్‌లో కాటన్ బాల్‌ను ముంచి, పడుకునే ముందు మొటిమలు ఉన్న చెంపపై అప్లై చేయండి.  మీరు ఉదయం చర్మం చేసుకున్న తర్వాత చాలా మంచి ఫలితాలను పొందుతారు.


తేనె: 


తేనెను ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇది చర్మం మాయిశ్చరైజింగ్‌, యాంటీ బాక్టీరియల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. 


𓇊 తేనెను మీ చెంపపై ఉన్న మొటిమల పై అప్లై చేయడం వల్ల మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. పదిహేను నిమిషాల పాటు తేనెను చెంపపై ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 


అలోవెరా: 


అలోవెరా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. చర్మం అందంగా కనిపించడంలో అలోవెరా ఎంతో మేలు చేస్తుంది.


𓇊 అలోవెరా జెల్‌ను  మీ చెంపపై అప్లై చేసి ఇరువై నిమిషాల తర్వాత ముఖం కడుకోవాలి. ఇలా చేయడం వల్ల చెంపపై ఉండే మొటిమలు తగ్గుతాయి.


Also Read Hot Sauce: సాస్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter