గుడ్డు తినేవారికి హెచ్చరిక..! ఎక్కువగా తింటే వీటి బారిన పడటం ఖాయం!
Egg Side Effects: గుడ్డు..శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజు గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యలు సలహా ఇస్తారు. గుడ్డు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Egg Side Effects: గుడ్డు అనేది అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్దాల్లో ఒకటి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. విటమిన్ బి 12, విటమిన్ డి మరియు అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. కానీ ఎగ్స్(Eggs) ఎక్కువగా తింటే శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయో..దుష్ర్పభావాలు కూడా అలానే ఉంటాయి. వాటి గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. లేదంటే రకరకాల ఆరోగ్య సమస్యలు(Health Problems) ఎదుర్కోవాల్సి వస్తుంది.
*గుడ్డులోని తెల్లసొనలో కొవ్వు ఉండదు అంతేకాక ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కొంతమందికి గుడ్డులోని తెల్లసొనను తీసుకోవడం వల్ల అలర్జీ వస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మంపై దద్దుర్లు, వాపు, ఎరుపు, తిమ్మిరి, అతిసారం, దురద మొదలైన సమస్యలు ఏర్పడవచ్చు. అలర్జీ సమస్యలు ఉన్నవారు గుడ్లు తినకుండా ఉండటమే మంచిది.
Also Read:Best weight loss foods: బరువు తగ్గేందుకు బెస్ట్ ఫుడ్ ఐటమ్స్
* గుడ్డులోని తెల్లసొనలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి చాలా హానికరం. వాస్తవానికి మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ మొత్తంలో GFR (మూత్రపిండాలను ఫిల్టర్ చేసే ద్రవం) కలిగి ఉంటారు. గుడ్డులోని తెల్లసొన GFR ని మరింత తగ్గిస్తుంది. దీని కారణంగా కిడ్నీ రోగులకు సమస్య మరింత పెరుగుతుంది.
* గుడ్డులోని తెల్లటి భాగంలో అల్బుమిన్ ఉంటుంది. దీని కారణంగా బయోటిన్‌ను శోషించడంలో శరీరానికి సమస్యలు తలెత్తుతాయి. దీంతో కండరాల నొప్పికి సంబంధించిన సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు రాలడం మొదలైన సమస్యలు ఏర్పడుతాయి.
* మరోవైపు గుడ్డులోని పసుపు భాగం గురించి మాట్లాడితే ఇందులో కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో ఉంటుంది. మీరు రోజూ రెండు కంటే ఎక్కువ గుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, డయాబెటిక్ రోగులు గుడ్లను తినకుండా ఉంటే మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook