COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weight Loss Diet: ఊబకాయం వల్ల శరీర ఆకృతి పెరిగి అందహీనంగా తయారవుతారు. అంతేకాకుండా చాలా మందిలో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులైనా మధుమేహం, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎంత సులభంగా శరీర బరువును నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం ఖాయని వారంటున్నారు. ఊబకాయం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్యమైన ఆహారాలు తీసుకోవడమే కాకుండా.. ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండటమే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా బరువు తగ్గడానికి వారు సూచించే చిట్కాలను పాటిస్తే 100% ఫలితం ఖాయమని చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


అల్పాహారంలో మార్పులు తప్పనిసరి:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది బరువు పెరుగుతున్నారు అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి తప్పనిసరిగా అల్పాహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆకలిని నియంత్రించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. 


గుడ్లు, మొలకలు:
శరీర బరువును తగ్గించేందుకు ప్రోటీన్ల గల ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. కోసం ఆహారంలో గుడ్లు, మొలకెత్తిన గింజలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా బరువు తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారంలో భాగంగా గుడ్లు, మొలకలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?


అల్పాహారంలో పండ్లు తప్పనిసరి:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు అల్పాహారంలో తప్పకుండా ఆరోగ్యకరమైన పండ్లను తినాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతిరోజు అరటిపండు, నారింజ, బెర్రీలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు విటమిన్ సి అధిక పరిమాణంలో ఉండే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ లేదా బ్లాక్‌బెర్రీస్ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఖనిజాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 


బరువు తగ్గే క్రమంలో పెరుగును తినొచ్చా?:
సహజ ప్రోబయోటిక్‌ పరిమాణాలు ఉన్న పెరుగును ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోటీన్లు క్యాల్షియం శరీర బరువును తగ్గించడమే.. కాకుండా ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో అల్పాహారంలో పెరుగుతో తయారుచేసిన లైట్ ఫుడ్స్ తినడం చాలా మంచిది.


ఉదయాన్నే కాఫీ తాగాల్సి ఉంటుంది:
ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా శరీరానికి శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే మూలకాలు  జీర్ణ క్రియ సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ను నియంత్రించేందుకు కూడా దోహదపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీ లను కూడా తాగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి