Weight Loss Diet: చాలా మంది వాతావరణ మార్పుల కారణంగా కూడా బరువు పెరుగుతారు. ముఖ్యంగా శీతాకాలంలో శరీరిక శ్రమ తగ్గడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా కొంతమంది చలి కారణంగా వ్యాయామాలు కూడా చేయ్యడం మానుకుంటారు. దీని వల్ల కూడా బరువు సులభంగా పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే శీతాకాలంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉండేవి తీసుకోకపోవడం. ఇతర మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలి కాలంలో శరీర బరువు తగ్గించుకోవడానికి ఇలా చేయండి:
చలి కాలంలో శరీర బరువును తగ్గించుకోవడానికి తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం పెరగడం కారణంగా శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే రుచి కరమైన ఆహారాలు తీనేందుకు ఇష్టపడతారు. అయితే ఇందులో కేలరీలు అధికంగా ఉండే ఆహారాలే అధికంగా ఉంటున్నాయని వీటిని తినడం వల్ల శరీర బరువు సులభంగా పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా బరువు తగ్గాలనుకునేవారు వీటిని తినకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  


బరువు తగ్గడానికి శీతాకాలంలో ఫైబర్, విటమిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే బరువు తగ్గడమేకాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శీతాకాలంలో బరువు నియంత్రించుకునేవారు  చేపలు, గుడ్లు, పండ్లు, గింజలు, బీన్స్ అతిగా తీసుకోవాల్సి ఉంటుంది.


ఎండాకాలం అయినా, చలికాలమైనా.. ఆరోగ్యవంతమైన శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యం. కాబట్టి వ్యాయామాలు, యోగా తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


చలి కాలంలో బరువు తగ్గే వారు మార్కెట్‌లో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంది. ఒక వేళా తీసుకుంటే అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలీక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్నాక్స్‌లో ఏదైనా తినాలనుకుంటే డ్రైఫ్రూట్స్‌తో చేసిన వాటిని తీసుకోవడం చాలా మంచిది.


చలికాలంలో కూడా శరీర హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నీరును అధిక పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీటి శాతం అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తినాల్సి ఉంటుంది.


Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు 


Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook