Weight Loss Diet: స్వీట్ పొటాటోతో కేవలం 7 రోజుల్లో శరీర బరువుకు ఇలా చెక్ పెట్టొచ్చు..
Sweet Potato For Weight Loss: స్వీట్ పొటాటోలో శరీరాన్ని కావలసిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Sweet Potato For Weight Loss: చలికాలంలో మార్కెట్లో దుంపలు విచ్చలవిడిగా లభిస్తాయి. ముఖ్యంగా స్వీట్ పొటాటో వంటి అధిక పోషకాలు ఉన్న దుంపలు తాజాగా లభిస్తూ ఉంటాయి. అయితే ఈ కందగడ్డను క్రమం తప్పకుండా సలాడ్స్ లో గాని..ఉడకబెట్టుకొని కానీ ఆహారంగా తీసుకుంటే సీజన్లో వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యలనుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గే క్రమంలో డైట్లో వీటిని వినియోగిస్తే త్వరలోనే మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఈ స్వీట్ పొటాటో విటమిన్ ఎ, మినరల్స్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.
స్వీట్ పొటాటో ఎలా బరువు తగ్గాలో తెలుసా..?
డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది:
కందగడ్డలో బరువును నియంత్రించే డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా డైట్ లో భాగంగా తీసుకుంటే ఆకలిని నియంత్రించి సులభంగా శరీరం తగ్గిస్తుంది. అంతేకాకుండా సీజనల్ లో వచ్చే వ్యాధుల నుంచి శరీరాన్ని సంరక్షిస్తుంది.
నిరోధక శక్తిని పెంచుతుంది:
బరువు తగ్గే క్రమంలో చాలామంది కఠిన తల వ్యాయామాలు ఇతర యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలామంది రోగనిరోధక శక్తిని కోల్పోతూ ఉంటారు. బరువు తగ్గే క్రమంలో రోగ నిరోధక శక్తి శరీరానికి చాలా అవసరం కాబట్టి ఈ క్రమంలో స్వీట్ పొటాటో తీసుకుంటే సులభంగా పెరుగుతుంది.
డీహైడ్రేషన్ సమస్యలకు చెక్:
శరీరంలో బరువు తగ్గే క్రమంలో తగినంత నీటి పరిమాణం తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే డిహైడ్రేషన్ సమస్యలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కొందరిలో డిహైడ్రేషన్ సమస్య ప్రాణాంతకంగానూ మారొచ్చు. కాబట్టి శరీర డిహైడ్రేషన్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి స్వీట్ పొటాటోను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Niharika Konidela: ఆ విషయంలో మా అత్త కాళ్లు మొక్కాలంటున్న మెగా డాటర్!
Also Read: చిరు ఫ్యాన్ నేను.. అందుకే అలా ట్వీట్ చేశా.. ఎట్టకేలకు నోరు విప్పిన వర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook