COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Red Spinach For Weight Loss: ఆకు కూరలును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు చిన్న పిల్లలకు వీటిని ఆహారంగా ఇవ్వాల్సిందిగా సూచిస్తారు. అయితే బచ్చలికూర, పాలకూర అందరికి తెలిసిందే.. ఇందులో శరీరానికి కావాల్సిన  విటమిన్స్‌ సి, ఇ, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ అధిక పరిమాణంలో లభిస్తాయి.  ఎర్ర బచ్చలికూరను క్రమం తప్పకుండా తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఈ కింది అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. 


ఈ అనారోగ్య సమస్యల నుంచి చెక్‌:
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:

ఎర్ర బచ్చలికూరలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా పెద్దప్రేగు క్యాన్సర్, కొలెస్ట్రాల్ మరియు మధుమేహం సమస్యల నుంచి రక్షించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎర్ర బచ్చలికూర మలబద్ధకం సమస్య నుంచి కూడా సులభంగా దూరం చేస్తుంది. 


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో


శరీర బరువును నియంత్రిస్తుంది:
ఎర్ర బచ్చలికూరలో ప్రొటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి దీనిని ఆహారంగా తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. 


రక్తహీనత సమస్యలకు చెక్‌:
ఎర్ర బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కూరను తింటే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తాన్ని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 


మూత్రపిండాల సమస్యలన్నీ దూరం:
కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఎర్ర బచ్చలికూర ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ కిడ్నీలను డిటాక్స్ చేయడానికి సహాయపడుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఎర్ర బచ్చలికూర ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook