Weight Loss Drinks: ప్రపంచవ్యాప్తంగా బరువు పెరిగేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సులభంగా బరువు పెరుగుతున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది బరువు పెరగడం కారణంగా అందహీనంగా తయారువుతున్నారు. ఊబకాయం కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీని కారణంగా కొంతమందిలో గుండెపోటు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా శరీర బరువు తగ్గాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలా మంది ఊబకాయాన్ని నియంత్రించుకోవడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా హెల్తీగా బరువు తగ్గడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల బరువు తగ్గడమేకాకుండా సులభంగా కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. 


తేనె, నిమ్మ రసం:
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసంలో తేనె కలిపి తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఖాళీ పొట్టతో నిమ్మరసం తాగాల్సి ఉంటుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


జీలకర్ర, దాల్చిన చెక్క రసం:
జీలకర్ర, దాల్చిన చెక్క పొడితో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారు. అంతేకాకుండా సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలనుకునేవారు జీలకర్ర, దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి..ఉదయాన్ని ఆ నీటిని తాగాలి. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. 


నిమ్మరసం:
రోజు ఉదయం పూట లెమన్ వాటర్ తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు ఊబకాన్ని తగ్గించడమేకాకుండా జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. 


లస్సీ:
బరువు తగ్గడానికి లస్సీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు కొలెస్ట్రాల్‌ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక పొట్ట సమస్యలను కూడా సులభంగా తగ్గింస్తుంది. అయితే లస్సీని తీసుకునే క్రమంలో షుగర్‌ కానీ కొలెస్ట్రాల్‌ కలిగిన దానిని తీసుకోకపోవడం చాలా మంచిది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook