Weight Loss For Fennel Seeds Tea: బరువు తగ్గడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన చాలా రకాల చిట్కాలు పాటిస్తున్నారు. వాటిని అనుసరించిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నాయి.  ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు ప్రతి రోజు  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడమేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్‌లో భాగంగా సోంపు నీటిని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చు. దీని కోసం ప్రతి రోజు నీటిలో రెండు టీ స్పూన్ల సోంపును నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉండడమేకాకుండా బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోంపును బరువు తగ్గడానికి ఎలా వినియోగించాలో తెలుసా?:
సోంపు పొడి:

బరువు తగ్గడానికి, శరీరంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి సోంపు పొడి ప్రభావవంతంగా సహాయపడుతుంది. దీని కోసం మీరు మెంతి గింజలు, నల్ల ఉప్పు, ఇంగువ, సోంపు తీసుకుని మిక్సీలో వేసి గ్రైడ్‌ చేసి పొడిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన పొడి డబ్బలో భద్రపరుచుకుని ప్రతి రోజు వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ పొడిని వినియోగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. 


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్


రాత్రంతా నానబెట్టి ఇలా తీసుకోండి:
కడుపు తిమ్మిరి, జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు సోంపు గింజలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీని కోసం మెంతి గింజలను, సోంపు గింజలను తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి జీర్ణక్రియ పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు సోంపు గింజల నీటిని తాగాల్సి ఉంటుంది. 


సోంపు టీ:
సోంపు తో తయారు చేసిన టీ కూడా శరీర బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. అయితే బరువు తగ్గే క్రమంలో చాలామంది గ్రీన్ టీలను తాగుతూ ఉంటారు వాటికి బదులుగా సోంపు గింజలతో తయారు చేసిన టీ తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈటీవీ తయారు చేయడానికి ముందుగా సోంపును తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టి అందులో ఒక గ్లాస్ నీరును పోసుకొని రెండు టీ స్పూన్ల సోంపు గింజలను వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న తర్వాత అందులో రుచిని పెంచుకోవడానికి వెళ్ళాను 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత వడకట్టుకుని ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook