Loss Weight with 5 Simple Tips: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో ఊబకాయం సమస్యలు వస్తున్నాయి. ఊబకాయం కారణంగా చిన్న వయసులోనే మధుమేహం, హైబీపీ, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు డైట్‌ పద్ధతిలో మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు యోగాసనాలు కూడా వేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది కఠినతర వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా? బరువు తగ్గడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?:
వేగంగా బరువు తగ్గాలనుకునేవారు చాలా మంది తికమక పడిపోయి..వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక నుంచి ఇలా చేయనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. డైటింగ్‌, వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా ప్రతి రోజు ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకుంటే సులభంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరం దృఢంగా కూడా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వీటిని అనుసరించాల్సి ఉంటుంది. 


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్


వేగంగా బరువు తగ్గడానికి ఇలా చేయండి:
1. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు 7 నుంచి 8 వేల అడుగులు తప్పకుండా వాక్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం రెండు పూటలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.  


2. 30 నుంచి 40 నిమిషాల పాటు తప్పకుండా యోగాతో పాటు వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.


3. వ్యాయామాలు తప్పకుండా ఉదయం మాత్రమే చేయాల్సి ఉంటుంది.


4. ప్రతి రోజు వ్యాయామం, యోగాతో పాటు పీచు, ప్రొటీన్, కాల్షియం, విటమిన్-సి, పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.


5. బరువు తగ్గే క్రమంలో చాలా మంది భోజనం స్కిప్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మూడు పూటల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook