Weight Loss Tips: ఈ రసాలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. 21 రోజుల్లో మీరు బరువు తగ్గడం ఖాయం..!
Weight Loss In 21 Days: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. అనారోగ్యమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు.
Weight Loss In 21 Days: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. అనారోగ్యమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. బరువును నియంత్రించుకోవాడానికి తప్పకుండా పలు రకాల రసాలను తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించడానికి కృషి చేస్తాయి. అయితే ఎలాంటి రసాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మ, తేనెతో చేసిన టీ:
నిమ్మ, తేనెతో చేసిన టీ బరువును నియంత్రించేందుకు ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. దీంతో బరువు పెరగడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఉసిరి రసం:
ఉసిరి రసంలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. ఉసిరి రసం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి.. బరువును వేగంగా నియంత్రించేందుకు సహాయపడుతుంది. కావును బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ రసాన్ని తీసుకోవాలి.
గ్రీన్ టీ:
బరువు తగ్గడానికి గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ టీలో ఉండే గుణాలు బరువు తగ్గడానికి సహాయపడుతుంది .ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
అజ్వైన్ వాటర్:
వేగంగా బరువు తగ్గడానికి ప్రతిరోజూ అజ్వైన్ నీరును తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడానికి నియంత్రిస్తాయి.
అల్లం నీరు:
అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు అల్లం నీరు ఎంతగానో ఉపయోగపడతాయి. కావున బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తేనెతో కలిపిన అల్లం నీరు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్ ఎలా ఉందంటే?
Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్ ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook