Weight loss: బరువు తగ్గాలనుకునే వారికి తరుచుగా తినాలనే కోరికలు పుడుతూ ఉంటాయి. వారు తరచుగా అతిగా ఆహారం తినడం వంటి అలవాట్ల వల్లే ఈ కోరికలు వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటున్నారు. వీరు క్రమం తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పలువురు నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. బరువు తగ్గే క్రమంలో  వర్కవుట్‌లతో పాటు డైట్‌లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆహారంపై శ్రద్ధ వహించకపోతే బరువు తగ్గే క్రమంలో పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారంలో భాగంగా రొటీన్‌ తీసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. ఇది శరీర బరువును తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. బరువు తగ్గించుకోవడానికి  ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఓట్స్ ఇడ్లీ (Oats Idli)


భారతీయులు ఉదయం సాంబారుతో ఇడ్లీలను తింటూ ఉంటారు. అయితే కేవలం ఒకటే పిండితో చేసన ఇడ్లీలను తింటున్నారు. అయితే బరువు తగ్గడానికి వారానికి ఒక సారి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఓట్స్‌తో ఇడ్లీలను తినాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా తినడం వల్ల శరీరానికి ప్రోటిన్లు అందడమేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది.


గుడ్డుతో చేసిన చాట్ (Chat made with egg)


కొడి గుడ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గడానికి ప్రభావవంతంగా సహాయపడతాయి. కావున రాత్రి డిన్నర్‌లో ఎగ్‌తో చేసిన‌ చాట్‌ తిసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం రెండు కోడిగుడ్లను ఉడకబెట్టి.. ఒక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాబేజీ, ఇతర కూరగాయలను వేసి చాట్‌లా తయారు చేసుకొండి.  ఇలా చేసిన దానిని రాత్రి పూట తింటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.


క్యాబేజీ (Cabbage)


ప్రస్తుతం చాలా మందికి క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు. అయినప్పటికీ తింటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో అనేక రకాల పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేసి బరువు నియంత్రిస్తుంది. కావున బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ దీనిని  తినాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల కొవ్వును నియంత్రింస్తుందని వారు పేర్కొన్నారు. డిన్నర్‌లో దీనితో తయారు చేసిన వంటకాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.


కోకోనట్ రైస్ (Coconut Rice)


కొబ్బరి అన్నంను తయారు చేయడం చాలా సులభం. దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొబ్బరిలో బరువును తగ్గించే మూలకాలున్నాయని దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు. ఈ కోకోనట్‌ చేసిన రైస్‌ను వారం రోజులకోసారి తినండి. ఇలా చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.


Also Read: Godavari Floods LIVE: భద్రాచలం సేఫేనా? మరో నాలుగు గంటలు గడిస్తేనే.. పోలవరంలోనూ హై టెన్షన్


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత తగ్గిందంటే...



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.