Weight Loss Mistakes: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పెరిగినప్పుడు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ ను విధించాయి. దీని కారణంగా చాలా ఆఫీలు వర్క్‌ఫ్రం హోం డ్యూటీలను ఇచ్చేశాయి. దీని కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలో బాధపడుతున్నారు. కానీ ఇప్పడు బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా చాలా మందిలో పొట్ట చుట్టు కొవ్వు కూడా పెరగడం విశేషం. చాలా మంది ఈ సమస్య నుంచి విముక్తి పొందడాని వివిధ రకాల వ్యాయమాలు చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందలేక పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే సులవైన మార్గాల ద్వారా దీనిని నుంచి విముక్తి పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం పూట ఇలా చేయండి:


నిజానికి మన ఆరోగ్య పరంగా ఉదయం సమయం చాలా ముఖ్యమైనది. కావున ఉదయం పూట బాడీ హెల్తీగా లేకుంటే.. రోజంతా అంతే సంగంతి..! కావున ఉదయం పూట శరీరం అక్టివ్‌గా ఉండాలంటే.. త్వరగా నిద్ర లేవాలి. అంతేకాకుండా సమతూలమైన ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల  ఉదయం పూట హెల్తీగా ఉంటారు.


ఉదయం పూట ఈ తప్పులు చేయకండి:


ఉదయం పూట ఆఫీసుకు చేరుకోవడానికి చాలా టైమ్‌ పడుతుంది. దీని వల్ల చాలా మంది టిఫిన్ చేయడం మర్చిపోతున్నారు.. దీని వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీని కారణంగా శరీరం అలసిపోయి.. కొంత మంది టెన్షన్, స్ట్రెస్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కావున ప్రతి ఒకరు ఉదయం పూట ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే శరీర సమస్యలు పెరిగి.. బరువు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తిసుకుంటున్నారు. దీని వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరుగుతుంది. కాబట్టి ఉదయం పండ్లు, ఓట్స్ లేదా ఇతర ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు.


ప్రస్తుతం చాలా మంది లేట్ నైట్ పార్టీల వల్ల మొబైల్, ల్యాప్‌టాప్‌లో అర్థరాత్రి వరకు వీడియోలు చూడడం కారణంగా  ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమంది అనవసరంగా బరువు కూడా పెరుగుతున్నారు. కావున రాత్రి పూట తొందరగా నిద్రపోతే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Horoscope Today July 7th: నేటి రాశి ఫలాలు.. సంతానం కోసం ఎదురుచూసే ఈ 2 రాశుల వారికి శుభవార్త ఉండొచ్చు..


Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్


 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook