Food To Burn Belly Fat: ఈ రోజుల్లో మనం మన ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోవడం లేదు. మారిన జీవనశైలి, చెడు ఆలవాట్లు కారణంగా ఊబకాయ సమస్య ఏర్పడుతుంది. మీ బరువు అదుపులో లేకుంటే, శరీరంలో జీవక్రియ సరిగ్గా లేదని అర్థం చేసుకోండి. ఈ బిజీ లైఫ్‌లో పడి జిమ్, ఎక్సర్‌సైజ్ లేదా వర్కవుట్‌కి సమయం కేటాయించలేకపోతున్నారు జనాలు. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, త్వరగా బరువు తగ్గేలా చేసే కొన్ని డ్రింక్స్ (Weight Loss Drinks) ఉన్నాయి. వాటిని తయారుచేయడం కూడా చాలా సులభం. అవేంటో చూద్ధాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. మజ్జిగ (Buttermilk)
మజ్జిగను మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది బరువు తగ్గడానికి దివ్యౌషధం. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ఇది కడుపుని చల్లబరుస్తుంది మరియు జీవక్రియను పెంచుతుంది. దీన్ని ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. 


2. సబ్జా (Basil Seed or Sabja Seeds)
మీరు పొట్ట కొవ్వును త్వరగా కరిగించుకోవాలనుకుంటే సబ్జాను తీసుకోండి. వీటిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గుతారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. 


3. వేడి నీరు- నిమ్మకాయ
ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి తాగితే (Lemon Juice) బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా జీవక్రియ మెరుగువుతుంది. నిజానికి నిమ్మకాయలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, ఫోలేట్ మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. 


Also Read: Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook