Food for Weight Loss: నాజుగ్గా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ మారిన జీవన శైలితో ఈరోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీర బరువును తగ్గించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. శరీర బరువు తగ్గాలంటే అందుకు తగ్గ డైట్‌తో పాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఫైబర్ పుష్కలంగా ఉండే కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి. ఫైబర్ సమృద్ధిగా ఉండే 7 వెజిటేబుల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రకోలీ 


బ్రకోలీలో ఫైబర్‌తో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక ఒకప్పు బ్రకోలీలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కొద్దిపాటి ఆయిల్‌లో గార్లిక్‌తో పాటు బ్రకోలీని ఫ్రై చేసుకుని తినవచ్చు. బ్రకోలీ మీ డైట్‌లో చేర్చుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.


పాలకూర 


పాలకూర కంటికి మంచిది. ఇది యాక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఇన్‌సాల్యుబుల్ ఫైబర్స్ ఆరోగ్యానికి దోహదపడుతాయి. పాలకూరను పప్పులో వేసుకోవచ్చు లేదా సూప్ ద్వారా కూడా తీసుకోవచ్చు. పాలకూరను మీ రెగ్యులర్ డైట్‌లో ఉంటే బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.


పచ్చి బఠానీలు 


పచ్చి బఠాణీలు చాలా రుచికరంగా ఉండటంతో పాటు మంచి పోషకాహారం కూడా. ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. పచ్చి బఠాణీలను ఇతర కూరలతో కలిపి తీసుకోవచ్చు. పచ్చి బఠానీ వెయిట్ లాస్‌కు చాలా దోహదపడుతుంది.


బెండకాయ


బెండకాయలో కాల్షియం, పొటాషియం, కార్బో హైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, ఎంజైమ్స్ అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్‌ ప్రేగులను శుభ్రం చేయడంలో దోహదపడుతుంది.


గుమ్మడికాయ 


గుమ్మడికాయలో కాల్షియం, విటమిన్ ఏ, కె సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయతో స్వీట్స్ చేసుకోవచ్చు లేదా సూప్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్‌కి ఇది బాగా దోహదపడుతుంది.


క్యాలీఫ్లవర్ 


క్యాలీఫ్లవర్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్‌తో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు క్యాలీఫ్లవర్‌ను తమ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


వంకాయ 


వంకాయలో కూడా ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. ఇందులో ఉండే ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. వంకాయతో రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. 


Also Read: Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఖాయమే! ఎమ్మెల్యేలకు కేసీఆర్ సిగ్నల్ ఇచ్చేశారుగా?


Also Read: Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఖాయమే! ఎమ్మెల్యేలకు కేసీఆర్ సిగ్నల్ ఇచ్చేశారుగా?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook