Brown Rice Benefits: వైట్ రైస్..భారతీయుల భోజనంలో అతి ముఖ్యమైంది. దేశంలో అత్యంత ఇష్టంగా తినే ఆహారపదార్ధమిది. అయితే స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే వైట్ రైస్‌కు చెక్ పెట్టాల్సిందే. ఆ స్థానంలో బ్రౌన్ రైస్ ఎంచుకోవడం ఉత్తమం. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఎక్కువమంది అన్నం తినేందుకే ఇష్టపడతారు. కానీ వైట్ రైస్ అనేది స్థూలకాయాన్ని పెంచుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వైద్యులు కూడా వైట్ రైస్ తగ్గించాలని సూచిస్తున్నారు. మరి ఇష్టంగా తినే అన్నం ఎలా వదులుకోవడం. అందుకే ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది బ్రౌన్ రైస్. ఇదీ ధాన్యం నుంచి వచ్చిందే.  వైట్ రైస్ అనేది ప్రోసెస్డ్ కాగా..ఇది అన్ ప్రోసెస్డ్. బ్రౌన్ రైస్‌లో విటమిన్లు, మినరల్స్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.


బ్రౌన్ రైస్‌లో వైట్ రైస్ కంటె మూడు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అనేది బరువు తగ్గేందుకు ఉపయోగపడే అద్భుతమైన పోషక పదార్ధం. తెల్ల అన్నంతో పోలిస్తే ఇందులో స్టార్చ్ తక్కువగా ఉంటుంది. వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగేందుకు దోహదపడుతుంది. బ్రౌన్ రైస్ ఓవర్ ఈటింగ్ తగ్గిస్తుంది. 


వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ అనేది త్వరగా కడుపు నింపుతుంది. ఫలితంగా తరచూ ఆకలేయదు. వైట్ రైస్ అనేది త్వరగా జీర్ణమవడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బరువు పెరిగేందుకు పూర్తి అవకాశాలున్నాయి. అందుకే బ్రౌన్ రైస్‌ను ఎక్కువగా బరువు తగ్గేందుకు ఉపయోగిస్తుంటారు. బ్రౌన్ రైస్ అనేది కేవలం బరువు తగ్గేందుకే కాకుండా..డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల వారికి చాలా ప్రయోజనకరం. రోజూ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఉండదు. బ్రౌన్ రైస్ అనేది కేన్సర్ సెల్స్ నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే సెలేనియం, మాంగనీస్‌లు ధైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి, ఎనర్జెటిక్‌గా ఉండేందుకు సహాయపడతాయి.


Also read: Arjun Fruit Benefits: అర్జున ఫలంతో మీ గుండె పదిలం, మీ ఎముకలు బలోపేతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook