Red Capsicum For Weight Loss: మనం ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో రెడ్ క్యాప్సికం ఒకటి. మార్కెట్లో గ్రీన్ ఎల్లో రెడ్ క్యాప్సికములు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆహారాల రుచిని పెంచడమే కాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్ కాప్సికంలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్ ఏ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు దూరమవుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణ క్రియ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల వచ్చే పుట్ట సమస్యలు ఈ రెడ్ క్యాప్సికంతో సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా కోవిడ్ కారణంగా చాలామందిలో రోగనిరోధక శక్తి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!


చాలామందిలో ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో పాటు ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి రక్తహీనత సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి.. ప్రతిరోజు అల్పాహారంలో రెడ్ క్యాప్సికం తో తయారు చేసిన సలాడ్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు నెలల పాటు తీసుకోవడం వల్ల మీరే మంచి ఫలితాలు పొందుతారు.


బరువు కూడా తగ్గొచ్చు:
బరువు తగ్గే క్రమంలో వినియోగించే డైట్లలో క్యాప్సికం తో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటారు. 


Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook