Weight Loss With Night Drink In 7 Days: ప్రస్తుతం ఊబకాయం సమస్యలు చాలా మందిలో పెరుగుతున్నారు. క్రమంగా భారత్లో ఈ సమస్య బారిన పడేవారి సంఖ్య పెరగడం విశేషం. అయితే ఈ సమస్య రావడం వల్ల శరీరంలో పలు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు అధికం. కాబట్టి ఊబకాయంతో బాధపడేవారు పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు చేసి శరీరాన్ని ఫిట్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు రాత్రి పూట పలు డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డ్రింక్స్ ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ డ్రింక్స్ మీ బరువును తగ్గిస్తాయి:
గ్రీన్ టీ:

క్రమం తప్పకుండా గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును తగ్గించి.. పోషకాలు అందజేస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ వ్యవస్థను బలంగా చేస్తాయి. అయితే గ్రీన్ టీ ని రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత తీసుకుంటే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు.


దాల్చిన చెక్కతో చేసిన టీ:
దాల్చిన చెక్కతో చేసిన టీ తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థను బలంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీరాన్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి. కాబట్టి కాబట్టి ఊబకాయం ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు తప్పకుండా ఈ టీ ని తీసుకోవాలి.


గోరువెచ్చని నీరు:
ప్రస్తుతం కోవిడ్ కారణంగా చాలామంది నీటిని మరిగించి తీసుకుంటున్నారు. దీనికోసం రాత్రి నిద్ర పోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఊబకాయం సమస్యలకు చెప్పి పెట్టొచ్చు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా ప్రభావంతంగా పనిచేస్తుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook