Weight Loss Tips: సీరియస్ గా బరువు తగ్గాలంటే ఇలా చేయండి..7 రోజుల్లో బరువు తగ్గడం గ్యారెంటీ..
Weight Loss With Fruits In 7 Days: తాజా పండ్లు కూడా పెరుగుతున్న శరీర బరువును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. కింద పేర్కొన్న పండ్లను తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
Weight Loss With Fruits In 7 Days: తాజా పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గడానికి కూడా పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పండ్లలో కేలరీలను బర్న్ చేసే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఉదయం పూట ఆహారంలో తీసుకుంటే శరీర బరువును కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు అధిక కొలెస్ట్రాల్, అధిక బీపీ, మధుమేహం, గుండెపోటు వంటి తీవ్ర వ్యాధులకు చెక్ పెడతాయి.
బరువు తగ్గించే పండ్లు ఇవే:
కివి:
కివి పండ్లను ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా తినాలి. ఇందులో శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు.
ఆరెంజ్:
ప్రస్తుతం చాలా మంది శరీర బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గలేకపోతున్నారు. బరువును సులభంగా నియంత్రింయడానికి ఆరెంజ్ ఫ్రూట్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బొప్పాయి:
బొప్పాయి పండులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకుంటే స్థూలకాయానికి చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో గ్యాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే దీని గుజ్జుని జ్యూస్ చేసుకుని తాగితే జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.
యాపిల్:
రోజూ ఒక యాపిల్‌ను ఉదయం పూట టిఫిన్‌కు ముందు తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో బాగంగా ఈ పండ్లను తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook