Weight Loss With Garlic Tea: బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసిన బరువు తగ్గలేకపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది బరువు పెరగడం కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వెల్లుల్లి టీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు 21, విటమిన్లు A, B, C, సల్ఫ్యూరిక్ యాసిడ్‌లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వెల్లుల్లి టీని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెల్లుల్లి టీని తాగడం వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గడం:

ప్రతి రోజు వెల్లుల్లి టీ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తుంది. అంతేకాకుండా శరీర ఆకృతుని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ మూలకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


అధిక రక్తపోటు:
అధిక రక్తపోటు, మధుమేహం వంటి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి వెల్లుల్లి టీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వెల్లుల్లి టీని తాగాల్సి ఉంటుంది.


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది:
వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని బ్యాక్టీరియా, ఇతర ప్రాణాంతక వ్యాధిల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. విటమిన్స్‌ లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వెల్లుల్లి టీని తీసుకోవాల్సి ఉంటుంది. 


ఫంగల్ ఇన్ఫెక్షన్:
ఆధునిక జీవనశైలిని పాటించేవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు వస్తున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వెల్లుల్లి టీని కూడా తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రభావిత ప్రాంతంలో వెల్లుల్లిని అప్లై చేయాల్సి ఉంటుంది.


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook