Pomegranate Seeds: రోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తాగితే ఏమౌతుందో తెలుసా
Pomegranate Seeds: ప్రకృతిలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు ఉంటాయి. వీటి ద్వారా లభించే పోషకాలు ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. దానిమ్మ ఇందులో అత్యంత ముఖ్యమైంది. రోజూ క్రమం తప్పకుండా దానిమ్మ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Pomegranate Seeds: సాధారణంగా దానిమ్మను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా దానిమ్మ దాదాపు అందరికీ మేలు చేకూరుస్తుంది. గంభీరమైన వ్యాధుల్ని సైతం దానిమ్మ ద్వారా చెక్ పెట్టవచ్చు. అందుకే చాలామంది వైద్యులు దానిమ్మను డైట్‌లో భాగంగా చేసుకోమని సూచిస్తుంటారు.
దానిమ్మ అనేది పోషకాలకు కేరాఫ్ అడ్రస్. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. వీటితోపాటు ఫైబర్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, షుగర్ లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇన్‌ఫ్లమేషన్, శరీరంలో ఆక్సిడేషన్, ఫ్రీ రాడికల్ సెల్ డ్యామేజ్ వంటివి తగ్గుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయి. దానిమ్మ గింజలు రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మ సంరక్షణ ఉంటుంది. వయస్సు రీత్యా ఎదురయ్యే చర్మంపై ముడతలు దూరమౌతాయి. చర్మానికి నిగారింపు చేకూరుతుంది. ఫైబర్ అధికంగా ఉండి కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో దోహదం చేస్తుంది.
రోజూ క్రమం తప్పకుండా దానిమ్మ గింజలు ఓ కప్పు తినడం అలవాటు చేసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే సహజసిద్దమైన రసాయనాలు బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా దానిమ్మ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్య సమస్యల్ని దూరం చేస్తుంది.
రోజూ క్రమం తప్పకుండా పరగడుపున దానిమ్మ గింజలు తినడం అలవాటు చేసుకుంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించి కణాలకు రక్షణ అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు గుండె వ్యాధుల్ని దూరం చేస్తాయి.
Also read: YS Sharmila: వైఎస్ షర్మిలపై రేగుతున్న అసమ్మతి, పదవి పోనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.