Drinking Water: మనలో చాలామందికి భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం అలవాటు. ఇంకొంతమందికి భోజనం చేసిన కాస్సేపటికి నీళ్లు తాగుతుంటారు. అయితే ఇందులో ఏది మంచిది ఏది కాదు. నీళ్లు ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదనే వివరాలపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగితే ఏమౌతుంది


భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ బలహీనమౌతుంది. ఆహారం నమిలిన తరువాత గ్లాండ్స్ సలైవా ఉత్పత్తి చేస్తాయి. మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ ఉంటాయి. అందుకే మనం భోజనం నిమిలి తినాలంటారు. ఆ తరువాత ఈ ఎంజైమ్స్ కడుపులో ఎసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్‌తో కలిసి గాఢమైన మిశ్రమంగా మారుతుంది. ఈ లిక్విడ్ ముందు చిన్న ప్రేవుల్లోంచి వెళ్తూ..న్యూట్రియంట్లను సంగ్రహిస్తుంది. 


భోజనం చేసిన వెంటనే కడుపులో గ్యాస్ట్రైటిస్ పెరిగిపోతుంది. ఇది భోజనాన్ని జీర్ణం చేస్తుంది. భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల గ్యాస్ట్రైటిస్ తగ్గిపోతుంది. దాంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. 


భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుంది


స్థూలకాయం, జీర్ణ సంబంధ సమస్యలు, కడుపులో గ్యాస్ ఏర్పడటం, బ్లడ్ షుగర్, ఎసిడిటీ సమస్య, బ్లోటింగ్ లేదా ఛాతీలో మంట ఏర్పడతాయి.


నీళ్లెప్పుుడు తాగాలి


ఆరోగ్య నిపుణులు చెప్పిందాని ప్రకారం తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు కనీసం 2 గంటలు పడుతుంది. అందుకే ఈలోగా నీళ్లు తాగకుండా ఉంటే మంచిది. భోజనం చేసిన తరువాత 45-60 నిమిషాల తరువాత నీళ్లు తాగవచ్చు. ఆయుర్వేదం ప్రకారమైతే భోజనం ముందు నీళ్లు తాగితే శరీరం బలహీనౌతుంది. 


నీళ్లు సరైన సమయంలో తాగడం వల్ల బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ పటిష్టంగా ఉంటుంది. ఎసిడిటీ సమస్య ఉత్పన్నం కాదు. భోజనంలోని పోషకాలు సరైన రీతిలో సంగ్రహణ అవుతాయి


Also read: Weight Control Tips: రోజూ ఈ 5 పద్దతులు ఫాలో అయితే, జిమ్ అవసరం లేకుండానే అధిక బరువుకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook