కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఊపందుకున్న తర్వాత చాలా మంది మద్యం ప్రియులలో కలిగిన ఏకైక సందేహం ఏదైనా ఉందా అంటే అది ఇదే. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు (alcohol before vaccination) కానీ లేదా తర్వాత కానీ ఆల్కాహాల్ తీసుకోవచ్చా (alcohol after vaccination) అని. ఒకవేళ ఆల్కాహాల్ తీసుకుంటే వ్యాక్సిన్లపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects of alcohol on vaccines) ఉంటాయనేది మరో సందేహం.  కరోనా వ్యాక్సిన్‌పైనే ఎన్నో సందేహాలు ఉన్న ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాక్సిన్ ముందు కానీ లేదా ఆ తర్వాత కానీ మందు తాగినట్టయితే.. అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పటికే చాలా మంది హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సమాధానం చెప్పారు. అయినా ఈ వాటికి ఇంకా సమాధానం వెతుక్కునే వాళ్లకు కొదువే లేదు. తప్పులేదు.. ఆరోగ్యం విషయంలో ఆ మాత్రం జాగ్రత్తలు అవసరమే మరి. అందుకే అటువంటి సందేహాలకు సమాధానమే ఈ కథనం.


క్యాలిఫోర్నియా యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ వైరస్ రిసెర్చ్ జరిపిన పరిశోధనల ప్రకారం కొవిడ్-19 వ్యాక్సిన్ల ద్వారా పొందే రోగ నిరోధక శక్తిపై ఆల్కహాల్ ప్రభావం చూపలేదని తేలింది. అయితే, అంతటితోనే అయిపోయిందని అనుకోకండి. 


Also read: Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?


ఎందుకంటే ఇంకొన్ని ఇతర అధ్యయనాల ప్రకారం ఏదైనా వ్యాక్సిన్‌కి ముందు కానీ వ్యాక్సిన్లకు తర్వాత కానీ 24 గంటల నుంచి 48 గంటల మధ్య ఆల్కహాల్ తీసుకున్నట్టయితే, శరీరంలో వ్యాక్సిన్ ప్రభావాన్ని బలహీనపర్చే ప్రమాదం ఉందని కూడా తేలింది. ఇది కొవిడ్ టీకాలకు కూడా వర్తిస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. 


ఇందుకు ఒక శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. మద్యం తీసుకున్న తర్వాత శరీరం డీహైడ్రేషన్ (Alcohol side effects) బారినపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కి గురైన వెంటనే అలసిపోవడం.. ఫలితంగా వ్యాక్సిన్ ప్రభావం తగ్గడం జరుగుతుంది అంటున్నారు వైద్య నిపుణులు.


ఆల్కహాల్ రిసెర్చ్ కరెంట్ రివ్యూస్ అనే హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత కొద్దిగా ఆల్కహాల్ తీసుకుంటే పర్వాలేదు కానీ అది శృతిమించితేనే వ్యాక్సిన్ పనిచేయదు అని వెల్లడైంది.


Also read : Covishield 2nd Dose booking: కొవిషీల్డ్ 2వ డోస్ బుక్ చేసుకుంటున్నారా ? మీకు ఈ విషయం తెలుసా ?


ప్రభుత్వం ఏం చెబుతోంది...
కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వశ్చన్స్‌లో (FAQ) ఆల్కహాల్ అండ్ వ్యాక్సిన్స్ (alcohol and vaccines) అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. 


కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని ఆల్కహాల్ అండ్ వ్యాక్సిన్ అంశంలో ప్రస్తావించిన వివరాల ప్రకారం టీకాల ప్రభావాన్ని ఆల్కహాల్ బలహీనపరిచినట్లు ఆధారాలు లేవు.


టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరంపై, వ్యాధి నిరోధక శక్తిపై కరోనా వ్యాక్సిన్ల ప్రభావం (Effects of alcohol on Covid-19 vaccines) ఉండదు అని పరిశోధనల్లో రుజువు కానప్పటికీ... వ్యాక్సిన్లు (Vaccines) తీసుకోవడానికి, తీసుకున్న తర్వాత కనీసం 24 గంటల నుంచి 48 వరకు మద్యం సేవించకపోవడమే ఉత్తమం అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఇంకా అవసరమైతే మీ వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించిన తర్వాతే మీ ఆరోగ్య పరిస్థితినిబట్టి వైద్యుల సూచనల మేరకే నిర్ణయం తీసుకోవడం బెటర్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


Also read : COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook