Healthy Foods For Lungs: శరీరానికి ఆక్సిజన్ ను అందించడానికి ఊపిరితిత్తులు పనిచేస్తాయి. అలాంటి ఊపిరితిత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత కాలంలో చాలా మంది కొవ్వుతో కూడిన పదార్థాలు, చిరుతిళ్లు, నాణ్యతో లోపం ఉన్న ఆహారం తినడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి. ఈ పదార్థాలు తీసుకోవడం తగ్గించడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం.


ఈ క్రింది ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. 


పండ్లు, కూరగాయలు:


మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది.  పండ్లులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బెర్రీలు, యాపిల్స్, నారింజ, ద్రాక్ష, పుచ్చకాయ, కివి, మామిడి, పైనాపిల్‌ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరగాయలలో కెరోటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా  క్యారెట్లు, బంగాళాదుంపలు, బ్రోకలీ, పాలకూర, క్యాప్సికం వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. 


ధాన్యాలు:


ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవాలో ఫైబర్‌,యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. 


పప్పుధాన్యాలు:


చిక్కుళ్ళు, పెసలు, మినుములు: ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. 


చేపలు:


సాల్మన్, ట్యూనా, మాకేరెల్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 


వెల్లుల్లి:


అల్లిసిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి హానికరమైన జబ్బులు దరిచేరవు. 


అల్లం:


శ్వాసనాళాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం చాలా అవసరం. 


తేనె:


యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 


పసుపు:


కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. హానికరమైన రోగల బారిన పడకుండా కాపాడుతుంది. 


ఆలివ్ నూనె:


మంచి కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. దీని ప్రతిరోజు తీసుకోవచ్చు. 


Also read: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook