కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా మాస్క్ లు నిత్యజీవితంలో భాగమైపోయాయి. ఈ నేపధ్యంలో ఏ మాస్క్ లు సురక్షితం..ఏవి కావు. ఏది వాడితే మంచిదనేది తెలుసుకోవడం చాలాముఖ్యం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా మహమ్మారి సంక్రమణ ఎక్కువవుతున్నకొద్దీ మార్కెట్ లో వివిధ రకాల మాస్క్ ( Mask ) లు అందుబాటులో వచ్చాయి. ఎన్ 95 మాస్క్ ( N95 Mask ) వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్న పరిస్థితి. లేదా కాటన్ క్లాత్ మాస్క్ సరిపోతుందా..ఫేస్ షీల్డ్ ఎంతవరకు మేలు చేస్తుంది..ఈ సందేహాలన్నింటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్. 


అసలు మాస్క్ లు ఎందుకు వాడాలనేది తెలుసుకోవాలి ముందు. మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లను బయటకు రాకుండా బంధించి ఉంచేందుకు మాస్క్ లు ఉపయోగపడుతాయి. ఈ క్రమంలో ఏయే రకాల మాస్క్ లు ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయి..ఏవి కావు అనేదానిపై ఫిిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్ ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం…


పారదర్శకంగా ఉండే ఫేస్ షీల్డ్ ( Face shield ) ఒక్కటే వాడితే తుంపర్లు షీల్డ్ వెనుక నుంచి కిందకు వచ్చి వ్యాపించే ప్రమాదముంది. 10 మైక్రాన్లు, అంతకన్నా చిన్నగా ఉన్న తుంపరల నుంచి ఇవి కాపాడలేవు. కాబట్టి ఇది అంతగా క్షేమకరం కాదు. 


వాల్వ్ ఉన్న మాస్క్ లు...అవి ఎన్ 95 అయినా సరే మంచిది కానేకాదు. వాల్వు ఉన్న మాస్క్ లు వాడటం పూర్తిగా మానేయడం మంచిది. ఎందుకంటే దీని నుంచి సూక్ష్మజీవులు బయటకు పోయే ప్రమాదం కచ్చితంగా ఉంది. 


క్లాత్ మాస్క్ లు చాలా వరకు మంచివనే అభిప్రాయమే ఉంది. కనీసం రెండు పొరలతో ఉన్న కాటన్ క్లాత్ మాస్క్ ( Cotton cloth mask ) లను ముక్కు నుంచి గెడ్డం వరకూ మూసేసి వాడాలి. దీనితో పాటు అదనంగా ఫేస్ షీల్డ్ వాడితే ఇంకా మంచిది. ముఖ్యంగా ఎక్కడైనా ఆఫీసులు, షాపుల్లో పనిచేసేటప్పుడు ఇలా వాడితే చాలా ప్రయోజనకరం.