Why Ginger is Beneficial: అల్లంలో చాలా రకాల  ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉన్న ఔషధ గుణాలు 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుందని అధ్యాయాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. ఈ అల్లాన్ని పలు రకాలుగా ఆహారంలో వినియోగించవచ్చు. దీనిని ఎలా వినియోగించడం వల్ల అధిక ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లం క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నాయి:


క్యాన్సర్‌ను నివారిస్తుంది:


ఆధునిక పరిశోధనలు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ రకాల క్యాన్సర్‌లను నివారించేందుకు అల్లం సమర్థవంతమైన ఔషధంగా పని చేస్తుందని పేర్కొంది. ముఖ్యంగా అండాశయ క్యాన్సర్ కణాలను నాశనం చేయడమే కాకుండా.. ఇతర కాన్సర్లు రాకుండా నిరోధింస్తుందని USలోని 'మిచిగాన్ యూనివర్సిటీ సమగ్ర క్యాన్సర్ సెంటర్' అధ్యయనం తెలిపింది. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. అండాశయ క్యాన్సర్ కణాలపై అల్లం పొడి చల్లినప్పుడు.. క్యాన్సర్ కణాలు నాశనమైనట్లు వారు తెలిపారు. ఈ ప్రక్రియకు అపోప్టోసిస్ అని పేరు పెట్టారు.


మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది:


ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి అల్లం ప్రభావవంతంగా ఔషదంగా పని చేస్తుందని నిపుణులు తెలిపారు. అల్లంలో ఉండే ఇన్సులిన్ కండరాల కణాలకు గ్లూకోజ్‌ను రవాణా చేయడమే కాకుండా.. అధిక చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.


గుండెపోటును నివారిస్తుంది:


ఆయుర్వేద శాస్త్రంలో అల్లాన్ని ఓ అద్భత ఔషదంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే గుణాలు గుండెను బలంగా చేసి గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. 


కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది:


తరుచుగా వ్యాయామం చేస్తూ ఉంటారు.. దీని వల్ల కండరాల నొప్పి ఇతర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయతే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అల్లంతో చేసిన నూనె ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.


ఆస్టియో ఆర్థరైటిస్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది:


ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్లలో నొప్పి.. నేటికీ ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. అయితే ఒక పరిశోధన ప్రకారం.. మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌తో సమస్యలతో బాధపడుతున్నవారు అల్లం సారాన్నివినియోగించి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


పీరియడ్ నొప్పి ఉపశమనం:


ఆధునిక జీవన శైలి కారణంగా స్త్రీలందరూ పీరియడ్స్ నొప్పితో ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి శొంఠి పొడిని వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.  పీరియడ్స్ సమయంలో రోజూ ఒక గ్రాము అల్లం పొడిని ఆహారంలో తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.


కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది:


చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల వచ్చే అవకాశం ఉంది. రోజూ తీసుకునే ఆహారం వల్లే కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని  అధ్యనాలు పేర్కొన్నాయి. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ 3 గ్రాముల అల్లం పొడిని తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.


(NOTE: మీకు అల్లం పట్ల ఎలాంటి అలర్జీ లేనప్పుడు మాత్రమే పై సూచనలను తీసుకోండి మరియు అదే సమయంలో పైన ఇవ్వబడిన తీవ్రమైన సమస్యల కోసం తప్పనిసరిగా తగిన వైద్యుడిని సంప్రదించండి.)


 


 



 


Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!


Also Read: Horoscope Today June 23rd: రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారికి ఇవాళ ప్రత్యేకమైన రోజు.. శుభవార్తలు అందుకుంటారు..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.