Winter Food For Diabetes: శీతాకాలంలో తప్పకుండా మధుమేహం ఉన్నవారు 4 ఆహారాలు తీసుకోవాలి..ఎందుకో తెలుసా?
Winter Food For Diabetes: మధుమేహం ఉన్నవారు శీతాకాలంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Winter Food For Diabetes: ప్రస్తుతం మధుమేహం కారణంగా చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఆధునిక జీవనశైలి కారణంగా ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు శీతాకాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో చాలా మందిలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల జీర్ణక్రియ సమస్యల కూడా వస్తాయి. దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడం తగ్గడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ప్రమాదం రాకుండా ఉండడానికి తప్పకుండా ఆహారాల్లో ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలు చేర్చుకోవాల్సి ఉంటుంది.
శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:
మిల్లెట్:
చలికాలంలో మిల్లెట్‌తో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు శీతాకాలంలో ప్రతి రోజు వీటితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా చలి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో కూడా శరీరానికి కావాల్సిన అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఈ చెక్కతో తయారు చేసిన టీలను, ఆహారాలను తీసుకోవడం వల్ల గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ రెండింటి స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారికి రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. శీతాకాలంలో గుండె జబ్బులతో బాధపడేవారు ప్రతి రోజు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీలను తాగాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
బీట్‌రూట్:
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి బీట్‌రూట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, ఫైటోకెమికల్స్ వంటి మూలకాలతో సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి శీతాకాలంలో బీట్‌రూట్‌తో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
క్యారెట్:
చలి కాలంలో లంచ్ లేదా డిన్నర్ ముందు ఒక పచ్చి క్యారెట్ తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతి రోజు క్యారెట్ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook